మూడ్రోజుల్లో వివరణ ఇవ్వండి..

Congress Shokaz notices to nine MLAs - Sakshi

తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ ‘షోకాజ్‌ నోటీసులు’

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా విజయం సాధించి టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్టు ప్రకటించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్‌ గుర్తు పై గెలిచిన తర్వాత అనైతికంగా టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారని వార్తలు వస్తున్నాయని, మీరు పార్టీ మారా రో లేదో మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ కోదండరెడ్డి పేరిట బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటీసులను ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిలకు పంపినట్టు గాంధీ భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

‘మీరు కాంగ్రెస్‌ తరఫున గెలి చి అక్రమ మార్గంలో అనైతికంగా, నీతిబాహ్యంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. మీరు పార్టీ మారుతున్నట్టు పత్రికల్లో కథ నాలు వచ్చాయి. మీరు మాట్లాడినట్టు వీడియో క్లిప్పింగ్‌లున్నాయి. మీరు ఏ విధమైన సిద్ధాంతపరమై న కారణాలు లేకుండానే కేవలం నియోజకవర్గ అభివృద్ధి అనే కారణంతో పార్టీ మారడం ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేసినట్టవుతుంది. మీరు చట్ట సభల్లో చట్టాలు చేసే బాధ్యత గల సభ్యులు. మీరు పార్టీ మారడం దురదృష్టకరం. మీరు పార్టీ మారారా లేదా అనే అంశాలపై 3 రోజుల్లో వివరణ ఇవ్వగలరు. మీ నుంచి ఎలాంటి సమాచారం రాని పక్షంలో మీరు పార్టీ మారినట్టు పరిగణించి చట్టపరంగా తగిన చర్య లు తీసుకుంటాం’ అని నోటీసులో పేర్కొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top