'టీఆర్ఎస్ డైరెక్షన్లోనే మండలి ఛైర్మన్' | congress mlcs meets councle chairman swamygoud | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ డైరెక్షన్లోనే మండలి ఛైర్మన్'

Feb 16 2015 2:04 PM | Updated on Mar 18 2019 7:55 PM

పార్టీ ఫిరాయించిన తొమ్మిదిమంది ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి మండలి ఛైర్మన్ను కలిశారు.

హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన తొమ్మిదిమంది ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి మండలి ఛైర్మన్ను కలిశారు. ఎమ్మెల్సీల అనర్హతపై కోర్టు జోక్యం చేసుకోనందని, అందుకే మరోసారి ఛైర్మన్ను కలిసి ఎమ్మెల్సీలపై వేటు వేయాలని కోరినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్రావు సోమవారమిక్కడ తెలిపారు. ఏడు నెలలుగా తమ విచారణ పిటిషన్ను చైర్మన్ పట్టించుకోవడం లేదని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల ఓట్లతోనే ఛైర్మన్గా స్వామిగౌడ్ గెలిచారని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ డైరెక్షన్ మేరకే మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ప్రభాకరరావు ఆరోపించారు. నెల రోజుల్లో ఫిరాయింపుల ఎమ్మెల్సీల పదవీ కాలం గడువు ముగుస్తుందని, ఈలోగా ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసి ఛైర్మన్ హుందాగా, నైతికంగా వ్యవహించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీల వివరణకు మరో నెల రోజుల గడువు ఇవ్వడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement