కాంగ్రెస్‌కు ఉహించని షాక్‌ | Congress Leaders Join In TRS Karimnagar | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో ​కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే

Sep 10 2018 10:11 AM | Updated on Mar 18 2019 7:55 PM

Congress Leaders Join In TRS Karimnagar - Sakshi

కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, బైరం పద్మయ్య

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్‌ నాయకులు గులాబీ తీర్థం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్‌ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆకారపు భాస్కర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని తెలిసింది. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఈ విషయాన్ని గులాబీ బాస్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌లు జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ పదవుల్లో కొనసాగారు.

ముందస్తు ఎన్నికల  సమయంలో వారు పార్టీని వీడటం నష్టమే. కాగా.. ఈ ఇద్దరు నేతలు 12న తెలంగాణ భవన్‌లో తమ అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది. కాగా.. రిటైర్డు ఆర్డీవో, ఉద్యోగసంఘాల నేత బైరం పద్మయ్య కూడా కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈయన చొప్పదండి టికెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement