సెలవురోజూ పనిచేయాలా?

Commercial Tax Department Officials Worried on Holiday - Sakshi

ఉన్నతాధికారుల తీరుతో వాణిజ్యశాఖ ఉద్యోగుల ఆవేదన

అబిడ్స్‌: వాణిజ్య పన్నులశాఖ ఉన్నతాధికారుల తీరుతో కింది స్థాయి అధికారులు, వ్యాపార డీలర్లు లబోదిబోమంటున్నారు. ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌తో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మాల్స్, సినిమా థియేటర్లు, జనసంద్ర ప్రాంతాలు, విద్యా సంస్థలు ఈ నెల 31 వరకు మూసివేయాలని సీఎం కేసీఆర్‌ స్వయానా ఆదేశించారు. అయితే సీఎస్‌ శని, ఆదివారాల్లో కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా వి«ధులు నిర్వహించాలని సర్క్యులర్‌ జారీ చే శారు. ఈ నెల 31 వరకు అన్ని వాణిజ్య పన్నుల శాఖా కార్యాలయాల్లో సెలవు దినాల్లో కూడా, రెండవ శనివారం, ఆదివారాల్లో కూడా కార్యాలయాలు తెరిచి ఉండాలని హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు, సిబ్బంది లబోదిబోమంటున్నారు. అంతేకాక కరోనా భయంతో గజగజలాడుతున్న వ్యాపారస్తులు, హోల్‌ సేల్‌ డీలర్లు కూడా వాణిజ్య పన్నులశాఖ అధికారుల తీరుపట్ల మండిపడుతున్నారు. శని, ఆదివారాల్లో పలువురు వాణిజ్య పన్నుల అధికారులు డీలర్లకు ఫోన్‌లు చేసి తమ కార్యాలయాల్లోకి రావాలని, పన్నులు చెల్లించాలని కోరడంతో పలువురు వ్యాపారస్తులు ప్రభుత్వ తీరుపట్ల విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాక పలువురు అధికారులు చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ జారీ చేసిన సర్క్యులర్‌ను మీడియాకు చూపిస్తూ ఆయన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చే శారు. 

టార్గెట్లే... టార్గెట్లు
సర్కిల్‌ స్థాయి అధికారులు, సిబ్బంది సెలవు దినాల్లో కూడా ట్యాక్స్‌ అధిక మొత్తం వసూలు చేయాలని ఉన్నతాధికారులునిర్ణయాలు తీసుకుంటడంతో పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనై వైరస్‌తో భయపడుతున్న వ్యాపారస్తులు కానీ, అధికారులు కానీ, సిబ్బంది కానీ పై అధికారుల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక అధికారుల మధ్య పన్నులు వసూళ్ళు టార్గెట్‌లు, పోటీలు పెట్టి వేధిస్తున్నారని పలువురు వాపోయారు. కొంత మంది యూనియన్‌లో ఉన్నప్పటికీ వారిని కూడా సెలవు దినాల్లో పన్నులు వసూళ్ళు చేయాలని హుకుం జారీ చేయడంతో యూనియన్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top