సీఎం మంజూరు పత్రం ఇచ్చినా... | cm kcr sanctioned food security card that its no use | Sakshi
Sakshi News home page

సీఎం మంజూరు పత్రం ఇచ్చినా...

Jan 25 2015 9:19 AM | Updated on Oct 2 2018 8:49 PM

సీఎం మంజూరు పత్రం ఇచ్చినా... - Sakshi

సీఎం మంజూరు పత్రం ఇచ్చినా...

ఎం కేసీఆర్ ఇటీవల వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా అర్హులకు పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందజేశారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రవీణ్‌కుమార్. సీఎం కేసీఆర్ ఇటీవల వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా అర్హులకు పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందజేశారు. లక్ష్మీపురానికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఆహార  భద్రత కార్డుకు అర్హుడని ప్రకటించారు. మంజూరు పత్రం ఈనెల 9న సీఎం చేతుల మీదుగా అందుకున్నాడు. అయితే శుక్రవారం జాబితాలో ప్రవీణ్‌కుమార్ పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు. సీఎం మంజూరు అయినట్లు ఇచ్చారు.. ఇప్పుడేమో అర్హుల జాబితాలో పేరు లేకపోవడంతో కంగుతిన్నాడు. దీంతో వెంటనే శనివారం వరంగల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు.                    
- వరంగల్
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement