ఆ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ | CM KCR orders to give Promotion for Constables | Sakshi
Sakshi News home page

ఆ కానిస్టేబుళ్లకు ప్రమోషన్

Jun 7 2014 2:24 AM | Updated on Aug 15 2018 9:20 PM

ఆ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ - Sakshi

ఆ కానిస్టేబుళ్లకు ప్రమోషన్

ఏపీఎన్‌జీవో సంఘం నిర్వహించిన ‘సమైక్యాంధ్ర’ సభలో జై తెలంగాణ అంటూ నినదించిన పోలీసు కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంలపై సస్పెన్షన్లు ఎత్తివేసి, ప్రమోషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశం
 సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్‌జీవో సంఘం నిర్వహించిన ‘సమైక్యాంధ్ర’ సభలో జై తెలంగాణ అంటూ నినదించిన పోలీసు కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంలపై సస్పెన్షన్లు ఎత్తివేసి, ప్రమోషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఈ కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రిని కలిశారు. సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అని నినాదాలు చేసినందుకు తమను సస్పెండ్ చేశారని సీఎంకు వివరించారు. దీనికి స్పందించిన కేసీఆర్ ఆ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి  విధుల్లోకి తీసుకోవడంతో పాటు ప్రమోషన్ ఇవ్వాలని అక్కడే ఉన్న డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు. సస్పెన్షన్‌లో ఉండగా ప్రమోషన్ ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవని డీజీపీ చెప్పారు. దీంతో నెలరోజుల్లో ప్రమోషన్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించగా వాటిని అమలు  చేయాలని మెదక్ ఎస్పీకి అధికారులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement