
చంద్రబాబు ఆ పనులు ఆపట్లేదు: ఈటల
తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే పనులను చంద్రబాబు ఆపడం లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే పనులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా ఆపడం లేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ పంట పొలాలకు నీళ్లు రాకూడదని ఢిల్లీలో సమావేశం ఏర్పాటుచేశారని ఆయన అన్నారు.
చంద్రబాబు ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తే మాత్రం ప్రజలు వాళ్లను క్షమించరని రాజేందర్ చెప్పారు. ఇక చేనేత కార్మికుల రుణాలన్నింటినీ రద్దు చేస్తామని తెలిపారు.