రక్తనిధి నిల్‌!.. గర్భిణుల అవస్థలు 

 Bloody Nil!..Pregnant women Stranding - Sakshi

ఎన్నికల వేళ శిబిరాల నిర్వహణకు  ఆసక్తి చూపని దాతలు 

సాక్షి, పాలమూరు: ప్రమాదం జరిగిన క్షతగాత్రుడికి రక్తం అవసరమైతే రక్తనిధి కేంద్రం వైపు పరుగులు తీస్తాం. రక్తహీనత ఉన్న గర్భిణి ప్రసవానికి ఆస్పత్రిలో చేరితే రక్తం ఎక్కిస్తాం. ఇక తలసేమియా, సర్జరీలు, డయాలసిస్‌ బాధిత రోగులకు రక్తం తప్పనిసరి. అత్యవసర సమయంలో బయట నుంచి రక్తం తెప్పించి ఎక్కించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో జిల్లా జనరల్‌ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో సరిపడా నిల్వలు లేని ప్రమాదకర స్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ వల్ల ప్రతి ఒక్క రూ ఎన్నికల బిజీలో ఉండటంతో రక్తదాన శిబిరా లు పెట్టకపోవడంతో పాటు స్వచ్ఛందంగా ఇచ్చే దాతలు రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అత్యవసరంగా రక్తం కావాల్సిన అభాగ్యులకు ర క్తం అందించలేని దయనీయ స్థితి ఏర్పడుతుంది. 

ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలింపు 
ఇటీవల తిమ్మసానిపల్లికి చెందిన లక్ష్మీ ప్రసవానికి జనరల్‌ ఆస్పత్రికి వస్తే.. బ్లడ్‌ బ్యాంకులో రక్తం లేదని వైద్యులు ఆమెను ప్రసవానికి ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇలా నిత్యం ఒకటి, రెండు కేసులు రక్తం నిల్వలు లేకపోవ డం వల్ల రెఫర్‌ చే యడం బాధకరం. లెబర్‌ రూంలో ఉద యం 9గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటలకు రెగ్యులర్‌ సీనియర్‌ వైద్యులు ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది రావడం లేదు.

కానీ మ ధ్యాహ్నం తర్వాత ప్రసవానికి వచ్చిన గర్భిణులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రాత్రివేళ అసలు వై ద్యులే లేరని సాకు చూపించి జూనియర్‌ వైద్యులు కేసులను అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నారు. దీనికితోడు రక్త నిల్వలు లేకపోవడం వల్ల రెఫర్‌ కేసులు పెరుగుతున్నాయి. 

బ్లడ్‌ బ్యాంకులో నిల్వ లేకనే.. 
మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం గైనిక్‌ విభాగంలో నిత్యం 40కి పైగా అడ్మిషన్లు అవుతుండగా, 27వరకు ప్రసవాలు అవుతున్నాయి. దీంట్లో 17నార్మల్‌ ఉంటే, 10వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. నిత్యం 7నుంచి 10మంది గర్భిణులు రక్తహీనత సమస్యతో ప్రసవానికి వస్తున్నారు.

కొందరిని రక్తం లేదని ప్రైవేట్‌ ఆస్పత్రులకు పంపుతున్నారు. దీంతో పాటు పలు రకాలుగా రోడ్డు ప్రమాదాలలో గాయపడుతూ ఆస్పత్రికి వస్తున్న వారు 20నుంచి 40మంది క్షతగాత్రులు ఉంటారు. వీరిలో దాదాపు 10మంది వరకు రక్తం అవసరం పడుతుంది. కానీ ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంకులో కావాల్సిన నిల్వలు లేకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల బాధితుల కుటుంబ సభ్యులే బయటి బ్లడ్‌ బ్యాంకుల్లో నగదు చెల్లించి రక్తం తీసుకొస్తున్నారు. 

శిబిరాల నిర్వహణ లేదు  
ఎన్నికల నేపథ్యంలో అధిక సంఖ్యలో శిబిరాల నిర్వహణ లేదు. కేవలం బ్లడ్‌ బ్యాంకు వారు నిర్వహించే శిబిరాలతో నడిపిస్తున్నాం. రోగుల వెంబడి వచ్చే కుటుంబ సభ్యులు రక్తం ఇస్తే బాగుంటుంది. కానీ వారు భయపడి రక్తం ఇవ్వడం లేదు. త్వరలో మెడికల్‌ కళాశాల విద్యార్థులతో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాం. బయటి నుంచి కూడా అధికంగా జనరల్‌ ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకుకు రక్త నిల్వలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. 
– డాక్టర్‌ రామకిషన్, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top