ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా: కాసుల బాల్‌రాజ్‌ | Bless Me On Elections Said By Kasula Balaraju In Nizamabad | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా: కాసుల బాల్‌రాజ్‌

Dec 3 2018 4:21 PM | Updated on Mar 18 2019 9:02 PM

Bless Me On Elections Said By Kasula Balaraju In Nizamabad - Sakshi

 బొమ్మన్‌దేవ్‌ పల్లిలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

 సాక్షి, నస్రుల్లాబాద్‌ : బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యునిగా ఈ సారి ఆశీర్వదించండి అని బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్‌ పార్టి అభ్యర్థి కాసుల బాల్‌రాజ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని సంగం,అంకోల్,బొమ్మన్‌దేవ్‌పల్లి హాజీపూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు రూ. 50వేల వరకు రుణ మాఫి,సంవత్సరానికి 6గ్యాస్‌ సిలిండర్లను ,డ్వాక్రా గ్రూపుకు రూ.లక్ష గ్రాంట్‌ ఉచితం ఇస్తామన్నారు.ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు మాల్యాద్రి రెడ్డి,రాజిరెడ్డి,దొంతురాం కాశీరాం,రాజేశ్వర్‌ రెడ్డి,సత్య నారాయణ  ఉన్నారు. 

ఏడాదికి 6 సిలిండర్లు ఉచితం 

బాన్సువాడరూరల్‌: కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ఏడాదికి 6 వంటగ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తుందని యూత్‌కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడ్కోల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కాసుల బాలరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ , ఒకే విడతలో 2లక్షల రుణమాఫీ చేస్తుందని, ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు రూ.లక్ష నగదు ఉచితంగా అందిస్తుందన్నారు. దేశాయిపేట్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రత్నాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement