వీడియో: దళితులపై బీజేపీ నేత దాష్టీకం.. | BJP leader bharath reddy attacks two dalits video goes viral | Sakshi
Sakshi News home page

వీడియో: దళితులపై బీజేపీ నేత దాష్టీకం..

Published Sun, Nov 12 2017 11:46 AM | Last Updated on Sun, Nov 12 2017 11:55 AM

BJP leader bharath reddy attacks two dalits video goes viral - Sakshi

సాక్షి,  నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణం చోటుచేసుకుంది. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై ఓ బీజేపీ నేత భరత్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. తాము ఎంత వేడుకున్నా వినిపించుకోని ఆ నేత కర్రతో బాధిత దళితులను బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నవీపేట మండలంలోని ఎర్రగుంట్ల వద్ద గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా బీజేపీ నేత మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే ఈ అక్రమ రవాణాపై ఇద్దరు దళిత వ్యక్తులు భరత్ రెడ్డిని ప్రశ్నించారు. 'నన్నే ప్రశ్నిస్తారా.. మీకెంత ధైర్యమంటూ' బాధిత దళితులను దుర్భాషలాడాతూ వారిపై తన జులుం ప్రదర్శించినట్లు సమాచారం. దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగుచూసింది. అన్యాయం, అక్రమాలను ప్రశ్నించినందుకు ఇద్దరు దళితులపై దాడి జరగడాన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడ్డ నేత భరత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement