
లింగంపేటలో ప్రచారం నిర్వహిస్తున్న రాంరెడ్డి
సాక్షి,లింగంపేట: భారతీయ జనతా పార్టీతోనే రాష్ట్రంలో, కేంద్రంలో సుస్థిర పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రాంరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలతోనే రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.సంతలో ప్రచారం నిర్వహించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు దత్తురాం, రాంచందర్, కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.