కరీంనగర్‌లో బీజేపీకి బ్రహ్మరథం | BJP Candidate Bandi Sanjay Election Campaign In Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో బీజేపీకి బ్రహ్మరథం

Dec 4 2018 3:12 PM | Updated on Mar 18 2019 9:02 PM

BJP Candidate Bandi Sanjay Election Campaign In Karimnagar  - Sakshi

రేకుర్తి షేకాబీకాలనీలో ముస్లిం మహిళలతో మాట్లాడుతున్న సంజయ్‌కుమార్‌

సాక్షి, కొత్తపల్లి: కరీంనగర్‌ నియోజకవర్గంలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. కొత్తపల్లి మండలం రేకుర్తి పంచాయతీ పరిధిలోని షేకాబీకాలనీ, బుడిగజంగాలకాలనీ, ముదిరాజ్‌కాలనీ, గౌడకాలనీ, హనుమాన్‌నగర్, చింతకుంట పరిధిలోని టీఆర్‌కే నగర్‌లో సోమవారం ప్రచారం నిర్వహించిన సంజయ్‌కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ప్రలోభపెట్టినా లొంగకుండా నిండు మనస్సుతో తనను ఆశీర్వదిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం మారుతి, నాయకులు తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కడార్ల రతన్‌కుమార్, పర్వతాల మల్లేషం, ఎడ్ల లక్ష్మణ్, పాదం శివరాజ్, పొన్నాల రాము, భూమేష్, దండు అంజయ్య, దుర్గం అంజయ్య, బి.లక్ష్మీరాజం, డి.సంతోష్, శ్రావణ్‌కుమార్, చరణ్, చింతల ఆంజనేయులు, చందు, భూమేష్, ఉపేందర్‌ పాల్గొన్నారు.  
ఒక్క అవకాశమివ్వండి


స్వచ్ఛమైన, నీతివంతమైన పరిపాలన కోసం ఒక్కసారి బీజేపీకి ఓట్లేసి గెలిపించాలని కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ కోరారు. కరీంనగర్‌ మండలం తీగలగుట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హన్మాన్‌నగర్, చంద్రపురికాలనీల్లో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.  బీజేపీ మండలాధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్, కాశెట్టి శేఖర్, గాండ్ల శ్రీనివాస్, అభిలాష్, సందీప్‌రెడ్డి  పాల్గొన్నారు. 


మాఫియా శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం
కరీంనగర్‌సిటీ: ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ దందాలు కొనసాగించేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్‌లు వ్యాపారులను వేధించారని, వారి అనుచరులతో నడుస్తున్న మాఫియా శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు.   ఎన్నికల కార్యాలయంలో గుమాస్తాల సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement