ట్రాఫిక్ పోలీసులకు అనుకోని షాక్ | Biker fall down after sees Traffic police in Hyderabad | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ పోలీసులకు అనుకోని షాక్

May 6 2019 12:23 PM | Updated on May 6 2019 1:44 PM

Biker fall down after sees Traffic police in Hyderabad - Sakshi

పోలీసులను చూడగానే ఒక్కసారిగా యువకుడికి ఫిట్స్ వచ్చి..

సాక్షి, హైదరాబాద్‌ : హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వాహనదారుడిని నిలువరించేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులకు అనుకోని షాక్ తగిలింది. ఎస్సార్ నగర్ ట్రాఫిక్  పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడపటాన్ని గమనించారు. యువకుడిని ఆపడానికి ప్రయత్నించగా, పోలీసులను చూడగానే ఒక్కసారిగా యువకుడికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతనికి సపర్యలు చేయాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement