'కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' | bifurcation episode of employees should be solved, devi prasad demands | Sakshi
Sakshi News home page

'కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది'

Oct 28 2014 4:31 PM | Updated on Sep 2 2017 3:30 PM

ఉద్యోగుల విషయంలో కేంద్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మండిపడ్డారు.

హైదరాబాద్:ఉద్యోగుల విషయంలో కేంద్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల అంశానికి సంబంధించి విభజన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పందించకపోతే ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని దేవీ ప్రసాద్ హెచ్చరించారు. దీంతో పాటు తెలంగాణ పబ్లిక్ కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement