వచ్చే ఎన్నికల్లో పార్టీలతో సంబం ధం లేకుండా బీసీ ముఖ్యమంత్రికే ఓటేయాలన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పార్టీలతో సంబం ధం లేకుండా బీసీ ముఖ్యమంత్రికే ఓటేయాలన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన టీడీపీకి అన్ని కుల సంఘాలు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ సవూవేశంలో ఆయన వూట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో ఇక కావలసింది పేదల ముఖ్యమంత్రేనని, సీఎం అభ్యర్థిని చూసే ఓటేయాలని కోరనున్నట్లు చెప్పారు. 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 28మంది ముఖ్యమంత్రులు మారినా ఒక్కబీసీ కూడా సీఎం కాలేకపోయారని, బీసీ కులాల్లో పుట్టడమే ఆ పదవికి అనర్హతగా మారిందన్నారు. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి బీసీ నాయకుడైతే, తరువాత కాలంలో ఎస్‌సీ, ఎస్‌టీ వంటి అణగారిన కులాలకు కూడా అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణలో మళ్లీ దొరల రాజ్యం తేవాలని జరుగుతున్న ప్రయత్నాలను బీసీలు ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నారు.