ఆర్మీ జవాన్ ఆత్మహత్య | army man suicide in hyderabad city | Sakshi
Sakshi News home page

ఆర్మీ జవాన్ ఆత్మహత్య

Feb 25 2015 6:22 PM | Updated on Nov 6 2018 7:56 PM

హైదరాబాద్ నగరం ఎల్లారెడ్డి గూడలోని తన నివాసంలోనే ఎన్ సతీష్ కుమార్ అనే ఆర్మీ జవాన్ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరం ఎల్లారెడ్డి గూడలోని తన నివాసంలోనే ఎన్ సతీష్ కుమార్ అనే ఆర్మీ జవాన్ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సతీష్ ఈ నెల 7న స్వగృహ ప్రవేశం నిమిత్తం ఢిల్లీ నుంచి వచ్చాడు. ఆర్ధిక ఇబ్బందులతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇల్లు కట్టడానికి సుమారు రూ.6 లక్షలు అప్పు చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement