బస్సు జాడ పట్టేస్తుంది!

బస్సు జాడ పట్టేస్తుంది! - Sakshi

  •     ఆగస్టుకల్లా ఆర్టీసీలో వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ

  •      తొలుత వెయ్యి మెట్రో బస్సులకు జీపీఎస్‌తో అనుసంధానం

  •      వంద బస్టాపుల్లో ఎల్‌సీడీ బోర్డులు

  •      బస్సుల రాకపోకలపై ముందస్తు సమాచారం

  •      బస్సుల్లో సీసీ కెమెరాలు

  • మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడ ఉంది.. ఎంత ఆలస్యంగా నడుస్తోంది.. పాయింట్‌కు ఎప్పుడు వస్తుంది.. ఇలా బస్సు జాడను పసిగట్టే వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయాణికులకు అందించే దిశగా గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు మెరుగైన వసతుల్ని కల్పించేందుకు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే విధంగా దీనిని ప్రారంభిస్తోంది.

     

    సాక్షి, సిటీబ్యూరో: ప్రజా రవాణ వ్యవస్థను పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.  రోడ్లపై నడిచే  బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో  పాటు, బస్సుల రాకపోకల సమాచారాన్ని  ప్రయాణికులకు  అందజేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం   అందుబాటులోకి తీసుకురానుంది. గతేడాది  సుమారు  రూ.18 కోట్ల  వ్యయం తో చేపట్టిన వె హికల్ ట్రాకింగ్  సిస్టమ్  ప్రయోగాత్మకంగా   రెండు బస్సుల్లో ప్రవేశపెట్టారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న  అనిశ్చితి కారణంగా కొత్త విధానం అమలులో  తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో ఆ ప్రాజెక్టును  పక్కన పెట్టేశారు.  



    తాజాగా  ముఖ్యమంత్రి  కేసీఆర్  ప్రజారవాణ పై  సమీక్షలు నిర్వహించి పలు సూచనలు చేయడంతో ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది.  ఆగస్టుకల్లా   1000 మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులను ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే వంద బస్టాపుల్లో  బస్సుల రాకపోకలను తెలిపే ఎల్‌సీడీ బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు. దశలవారీగా గ్రేటర్‌లో ఉన్న 3800 బస్సులను, అన్ని రూట్లను దీని పరిధిలోకి తీసుకురావాలని ఆర్టీసీ యజామాన్యం  భావిస్తోంది.

     

    ట్రాకింగ్ ఇలా చేస్తారు...



    ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు  సిస్టమ్ (ఐటీఎస్), ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (పీఐఎస్)లద్వారా ఆర్టీసీలో వెహికల్ ట్రాకింగ్ పద్ధతి అమలవుతుంది. ఇందుకోసం జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్  ఆధారంగా రోడ్లపై నడిచే బస్సుల కదలికలు కంఫ్యూటర్‌లో ఎప్పటికప్పుడు నమోదవుతాయి. దీని ద్వారా  బస్సులు  బ్రేక్‌డౌన్ అయినప్పుడు  తక్షణ చర్యలు చేపట్టవచ్చు. కండక్టర్లు,డ్రైవర్ల పనితీరును తెలుసుకోవచ్చు. ట్రిప్పులు రద్దు చేయకుండా  తగిన చర్యలు తీసుకోవచ్చు.



    ఈ విధాన ం ద్వారా  బస్టాపుల్లో ఉండే   ఎల్‌సీడీ  బోర్డుల్లో  బస్సుల రాకపోకల ప్రత్యక్ష సమాచారాన్ని ప్రదర్శిస్తారు. రాబోయే బస్టాపు వివరాలను తెలుసుకునేలా బస్సుల్లో కూడా  చిన్న ఎల్‌సీడీలను ఏర్పాటుచేస్తున్నారు. ఇది నగరానికి వచ్చే  కొత్తవాళ్లు, పర్యాటకులకు  ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్‌సీడీలతో పాటు బస్సుల్లో, బస్టాపుల్లో  అనౌన్స్‌మెంట్ కూడా చేస్తామని  ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.

     

    బస్సుల్లో సీసీ కెమెరాలు



    ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బస్సుల్లో సీసీ కెమెరాలను అమర్చనున్నారు. ప్రతి బస్సులో రెండు కెమెరాలు ఉంచుతారు. 48 గంటల పాటు  చిత్రీకరించేందుకు  వీలుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ముంబయి తరహాలో ప్రయాణికులు  క్యూ పద్ధతిని పాటించే  విధంగా కూడా అధికారులు తగిన ఏర్పాట్లు  చేయనున్నారు. మహిళలకు పూర్తి స్థాయిలో భ ద్రత కల్పిస్తారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top