16న కృష్ణాబోర్డు భేటీ

AP and Telangana fight again over Krishna water - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలోని లభ్యత జలాలు, రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు ఈ నెల 16న జలసౌధలో భేటీ కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల ఎగువన లభ్యతగా ఉన్న జలాల పంపిణీ, వాటాకు మించి ఏపీ చేసిన వినియోగం, భవిష్యత్‌ అవసరాలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు హాజరు కానున్నారు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంతో పాటు బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ అంశాలను ఎజెండాలో చేర్చారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top