తెలంగాణకు మరో మూడు ‘రే’ ప్రాజెక్టులు | Another three rajiv awas yojana schemes to Telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మరో మూడు ‘రే’ ప్రాజెక్టులు

Nov 12 2014 3:44 AM | Updated on Sep 2 2017 4:16 PM

రాజీవ్ ఆవాస్ యోజన(రే) కింద రూ.174.68 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు ప్రాజెక్టులు మంజూరయ్యాయి.

సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆవాస్ యోజన(రే) కింద రూ.174.68 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ మంగళవారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత యూపీఏ హయాంలో రే కింద నాలుగు ప్రాజెక్టులు మంజూరు కాగా.. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా మరో 3 కొత్త ప్రాజెక్టులను మంజూరు చేసింది. తాజాగా మంజూరైన ప్రాజెక్టులను పరిశీలిస్తే.. ఖమ్మం నగరంలోని రమణగుట్టలో రూ.39.43 కోట్లతో 925 గృహాలు, శివారులోని మల్లే మడుగులో రూ.118.44 కోట్లతో 2,375 గృహాలు, కరీంనగర్ జిల్లా రామగుండం పట్టణంలోని సీబీఎన్ కాలనీలో రూ.12.74 కోట్లతో 286 గృహాల నిర్మాణం కోసం మంజూరు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement