అమిత్‌షా తెలంగాణ పర్యటన వాయిదా | Amit Shah Telangana tour in January | Sakshi
Sakshi News home page

అమిత్‌షా తెలంగాణ పర్యటన వాయిదా

Dec 12 2014 5:30 AM | Updated on Aug 11 2018 7:56 PM

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది.

సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈనెల 27, 28వ తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలతోపాటు, పార్టీ పటిష్టానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాల్సి ఉంది. తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల నియోజకర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున వాటికి సంబంధించి కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం బిజీగా ఉంది. ఈ విషయాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లటంతో పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. జనవరి చివరలో పర్యటన కు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి రామచంద్రరావు అభ్యర్థిగా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement