గాంధీభవన్‌లో అంబేడ్కర్‌ జయంతి 

Ambedkar 128th Birthday The Congress Party has Done Well - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 128వ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అంబేడ్కర్‌ దేశానికి అందించిన స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశానికి మార్గదర్శకత్వం చేసిన ఆయన యువతకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో టీపీసీసీ నేతలు బొల్లు కిషన్, సతీశ్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top