మత్తు మందిచ్చి బాలికపై అత్యాచారం | A youngster raped girl by giving drug | Sakshi
Sakshi News home page

మత్తు మందిచ్చి బాలికపై అత్యాచారం

Jun 9 2015 9:28 PM | Updated on Jul 28 2018 8:40 PM

మత్తు మందిచ్చి బాలికపై అత్యాచారం - Sakshi

మత్తు మందిచ్చి బాలికపై అత్యాచారం

మత్తుమందు ఇచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

లంగర్‌హౌస్(హైదరాబాద్): మత్తుమందు ఇచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. టోలిచౌకి మిరాజ్ కాలనీకి చెందిన బాలిక(15) టోలిచౌకిలోని సీఫా ఎలైట్ షోరూంలో పని చేస్త్తోంది. నౌనంబర్ హుడా కాలనీకి చెందిన హమీద్(26) అదే షోరూంలో సేల్స్ మెన్‌గా పనిచేస్తున్నాడు. ఓకే షోరూంలో పని చేస్తున్న వీరు స్నేహితులు కావడంతో రెండు రోజుల క్రితం హమీద్ ఆ బాలికను నానల్‌నగర్ వద్ద కలవాలని ఫోన్ చేశాడు. సమీపంలో తనకు కొద్దిగా పని ఉందని, ఆ తర్వాత షోరూంకు కలసి వెళ్దామని ఆమెతో నమ్మబలికాడు. దీంతో ఆ బాలిక నానల్‌నగర్‌కు రాగా ద్విచక్ర వాహనంపై గండిపేట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు.

స్పృహ కోల్పోయిన బాలికపై అత్యాచారానికి పాల్పడాడు. తెలివి వచ్చిన తర్వాత ఆమె తనపై జరిగిన అఘాయిత్యంపై హమీద్‌ను నిలదిసింది. దీంతో అతను బాలికపై చేయిచేసుకున్నాడు. దీంతో బాధితురాలు మళ్లీ స్పృహ కోల్పోవడంతో భయపడ్డ హమీద్ కిషన్ బాగ్‌లో ఉండే తెలిసిన వైద్యుని వద్దకు తీసుకువచ్చి చికిత్స చేయించాడు. అనంతరం ఆమె ఇంటి సమీపంలో దింపి వెళ్లాడు. మరుసటి రోజు పూర్తిగా మత్తునుంచి తేరుకున్న ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికకు వైద్య పరిక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం హమీద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement