కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీ వాడి గ్రామంలో శనివారం జరిగింది.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీ వాడి గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన పెద్ద నర్సయ్య(58) వ్యవ సాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కుటుంబ కలహాలతో సతమతమవుతున్న నర్సయ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు అందాల్సి ఉంది.