సెల్‌ టవర్‌ ఎక్కి.. వ్యక్తి హల్ చల్! | a man climbed cell tower in siddipet district | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్‌ ఎక్కి.. వ్యక్తి హల్ చల్!

Feb 19 2017 1:45 PM | Updated on Aug 11 2018 8:15 PM

సెల్‌ టవర్‌ ఎక్కి.. వ్యక్తి హల్ చల్! - Sakshi

సెల్‌ టవర్‌ ఎక్కి.. వ్యక్తి హల్ చల్!

సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఓ వ్యక్తి సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు.

సిద్దిపేట: ఓ వ్యక్తి సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వేధింపులకు నిరసనగా మండలంలోని రాంచంద్రపూర్ గ్రామానికి చెందిన బత్తుల రాజు కోహెడలో ఆదివారం ఉదయం సెల్‌ టవర్‌ ఎక్కాడు. భూ వివాదంలో తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించాడు. సీఐ శ్రీనివాస్‌ అక్కడికి వచ్చి బాధితుడు రాజుకు హామీ ఇవ్వడంతో అతను సెల్ టవర్‌ పై నుంచి కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement