ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పాము కాటు వేసిన ఘటనలో ఒక చిన్నారి మృతిచెందగా.. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
కోడేరు (మహబూబ్‌నగర్) : ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పాము కాటు వేసిన ఘటనలో ఒక చిన్నారి మృతిచెందగా.. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం గన్యానాయక్ తండాలో శనివారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నిహారిక(4), చరణ్(7)లు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వారిని పాము కాటు వేసింది. దీంతో నిహారిక అక్కడికక్కడే మృతిచెందగా.. చరణ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.