చెట్టును ఢీకొన్న కారు: చిన్నారి మృతి


ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు కు చెందిన ఓ కుటుంబం భద్రాచలం పుష్కరాలకు వెళ్తున్నారు. కొత్త గూడెం సమీపంలో వారు ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. మరో 6 మందికి గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top