నలుగురు దొంగలు అరెస్ట్ | 4 thieves arrested | Sakshi
Sakshi News home page

నలుగురు దొంగలు అరెస్ట్

Oct 10 2015 8:20 PM | Updated on Aug 20 2018 4:27 PM

నలుగురు దొంగల్ని నిజామాబాద్ జిల్లా వర్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జాకోరా క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీ చేస్తుండగా.. దొంగలు పట్టుబడ్డారని, వీరి నుంచి అర కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసులు వెల్లడించారు.

వర్ని (నిజామాబాద్) : నలుగురు దొంగల్ని నిజామాబాద్ జిల్లా వర్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జాకోరా క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీ చేస్తుండగా.. దొంగలు పట్టుబడ్డారని, వీరి నుంచి అర కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. పట్టుబడిన వారు ఈనెల 23న మండల కేంద్రంలో రవి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్, ఎల్‌ఈడీ టీవీ, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. విచారణ అనంతరం బాన్సువాడలోని ఎర్రమన్నుకుచ్చ గ్రామంలో వారి నివాసాల నుంచి మూడు టీవీలు, తులం బంగారు నల్లపూసల దండ, సెల్‌ఫోన్, రెండు ల్యాప్‌టాప్‌లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జిల్లాలోని పలు దొంగతనాల్లో వీరి పాత్ర ఉన్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement