2 ఇసుక లారీలు సీజ్ | 2 sand larrys seize in nizamabad distirict | Sakshi
Sakshi News home page

2 ఇసుక లారీలు సీజ్

Feb 14 2015 12:53 PM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను అధికారులు శుక్రవారం అర్ధరాత్రి సీజ్ చేశారు.

నిజామ్‌సాగర్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను అధికారులు శుక్రవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. గత కొంత కాలంగా నిజామాబాద్ జిల్లాలో  రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో రవాణాను అడ్డుకోవడానికి అధికారులు నిఘా పెట్టారు. అందుకోసం ప్రత్యేక చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో నిజామ్‌పట్టణంలోని నౌర్సింగ్‌రావుపల్లి వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పాల్గొని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను అడ్డుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement