17 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ | 17 quintals ration rice seized | Sakshi
Sakshi News home page

17 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్

Feb 19 2016 5:34 PM | Updated on Sep 3 2017 5:58 PM

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు.

జూలూరుపాడు (ఖమ్మం) : అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని యలమంద అనే వ్యక్తి అద్దె ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 17 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సివిల్ సప్లై ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆర్‌ఐ కె.నరసింహారావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement