లోక్‌సభ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు 1.32 కోట్లు

లోక్‌సభ అభ్యర్థుల  ఎన్నికల ఖర్చు 1.32 కోట్లు - Sakshi


ఖమ్మం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌కు పోటీచేసిన అభ్యర్థుల వ్యయ వివరాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి మొత్తం 27మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 21 మంది అభ్యర్థులు మాత్రమే ఖర్చుల వివరాలను అందజేశారు. వీరు మొత్తం రూ.1,32,67,835లను ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. పరిమితికి మించి ఖర్చు చేసిన అభ్యర్థులపై క్రిమినల్ కేసులతో పాటు వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

 

 ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యయ పరిశీలకులనూ నియమించింది. ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 డిపాజిట్‌గా, ఇతర అభ్యర్థులకు రూ.25 వేలుగా నిర్ణయించింది. చాలా మంది అభ్యర్థులు డిపాజిట్ చేసిన మేరకు కొద్దిగా అటూఇటుగా ఖర్చు చేసినట్లు చూపించారు.

 

 

153 మంది వ్యయ వివరాలిచ్చారు..


 

 వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ శ్రీనరేశ్


 

ఖమ్మం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన 170 మంది అభ్యర్థులకు 153మంది వ్యయ వివరాలను సమర్పించారని జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ పి.కె.డ్యాస్ జిల్లా ఎన్నికల అధికారి, వ్యయ పరిశీలకులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను పూర్తిస్థాయిలో ఖర్చుల వివరాలు అందించాలని ఆదేశించామన్నారు. మిగిలిన వారిని సైతం నివేదికలు ఇచ్చేలా మళ్లీ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. మీడియా సర్టిఫికెట్, మానిటరింగ్ కమిటీ గుర్తించి పెయిడ్ న్యూస్, పత్రికా ప్రకటనలకు సంబంధించి అభ్యర్థులకు నోటీ సులు ఇచ్చామన్నారు.

 

సదరు ఖర్చులను వారి ఖాతాలో జమచేశామని తెలిపారు. డెరైక్టర్ జనరల్ మాట్లాడుతూ అభ్యర్థులు అందిం చిన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రిపోర్టులను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఇప్పటి వరకు ఖర్చుల వివరాలను అందించని అభ్యర్థుల నుంచి వెంటనే వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏయే అంశాల్లో మెరుగ్గా వ్యవహరించారో వివరాలు అందించాలని సూచించారు.



వ్యయ పరిశీలకులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమైన అంశాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్ట్రానిక్ మెయిల్ పంపాలని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ వ్యయ పరిశీలకులకు రాజ్‌కుమార్, ముత్తు శంకర్, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్, ఎన్నికల ఖర్చుల నోడల్ అధికారి శ్రీనివాస్, ఎన్నికల తహశీల్దార్ యూసుఫ్‌అలీ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top