breaking news
-
అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణపై ప్రేమతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించలేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేవలం రాజకీయం కోసమే పెట్టాడని మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నా ధైర్యం చూసి.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పనిచేస్తుంది. రాష్ట్రంలో 14 సీట్లు గెలవడమే మా టార్గెట్. దాన్ని అడ్డుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ..లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు బండి సంజయ్.. కవిత అరెస్ట్ అవుతుందని చెప్పిండు ఏమైంది. ఇప్పుడు కవితకు నోటీసుల విషయం కూడా అంతా డ్రామానే. అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరాను. గాంధీ కుటుంబంపై ప్రేమతోనే కాంగ్రెస్‌లో చేరాను. రాహుల్ అంటే నాకు పిచ్చి.. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. రాహుల్‌ను ప్రధానమంత్రి చేయడం కోసం నిర్విరామంగా పనిచేస్తా’ అని జగ్గారెడ్డి తెలిపారు. -
లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో తెలుసు: కేటీఆర్
సాక్షి, నాగర్ కర్నూల్: కుడితిలో పడ్డ ఎలుకల పరిస్థితిగా కాంగ్రెస్ స్థితి ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో మీకే తెలుసు. రేవంత్‌రెడ్డి తిరిగి పాతమూలాలకు పోతున్నట్టు ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి’’ అంటూ ప్రశ్నించారు. ‘‘పథకాలు అమలు కోసం కొత్త కొర్రీలు పెడుతున్నారు. మార్చి 17 వరకు వేచి చూద్దాం.. అవసరమైతే 6 నెలలు ఆగుదాం. ఇంకా రైతు బంధు ఎప్పటికీ వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో కేసీఆర్ పాలనపై తప్పుడు ప్రకటన చేయించారు. మోదీ హవా లేదు.. బోడీ లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని పార్టీ బీజేపీ. కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీకి అప్పగించిన చరిత్ర కాంగ్రెస్‌ది. మనం ప్రతిఘటిస్తే తిరిగి తీర్మానం చేశారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా అప్పర్ భద్రాకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది ’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘కారు సర్వీసింగ్‌కు పోయింది.. తిరిగి మంచి స్పీడుతో వస్తుంది. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచి కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా అండగా ఉంటాం. తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచే కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా తామంతా గంటలో వచ్చి అండగా ఉంటాం’’ అంటూ కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే.. -
లాస్య నందిత కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ..
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా, ఆదివారం ఉదయం మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని లాస్య నివాసానికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా నందిత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆమె తల్లి, సోదరిని ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారన్న వార్త విని షాక్‌కు గురయ్యానని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. pic.twitter.com/T5jPw2JV69 — BRS Party (@BRSparty) February 25, 2024 విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. లాస్య నందితను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి సాయన్న మరణించారని తెలిపారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/JTL25SzykP — BRS Party (@BRSparty) February 25, 2024 -
వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు. ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్ శనివారం గాం«దీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీలది డ్రామా బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్ మోడల్లో కులగణన త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్‌లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్‌కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూపాలని సవాల్ చేశారు. ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. -
మల్కాజిగిరి బరిలో ఈటల?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సహా ఇతర కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి–ఈటల రాజేందర్, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత 8 లేదా 9 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని, గతంలో ఓడిపోయిన స్థానాల్లో పార్టీ బలం పుంజుకుందని ఈ భేటీలో రాష్ట్ర నేతలు పార్టీ పెద్దలకు వివరించినట్లు సమాచారం. ఐకమత్యంతో పనిచేసి రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వారు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు బండి సంజయ్, డా. కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం: కె. లక్ష్మణ్ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని.. గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ చెప్పారు. పార్టీ జాతీయ నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాత్రలు, సభలపై అగ్రనేతలతో చర్చ జరిగిందని పేర్కొన్నారు. -
‘హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది అని కాంగ్రెస్ చెప్తోందని, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ప్రశ్నిస్తే దాడులు, నిర్బంధాలు, ఎదురిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘జర్నలిస్ట్ శంకర్‌పైన దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. సాయి రామ్ రెడ్డి హస్తినాపురం కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కి చెందిన అనుచరుడు. పథకం ప్రకారం శంకర్‌ను చంపాలని చూశారు. గొడవపడినట్టు ఇద్దరు మహిళలను పెట్టి పథకం ప్రకారం చేశారు. పాశవికంగా శంకర్‌పై దాడి జరిగింది. ఈ దాడిని అందరూ ఖండించాలి. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?. అక్షరంతో ప్రశ్నిస్తే అయుధంతో దాడులు చేస్తారా?. హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’అని బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోంది: క్రాంతి మాజీ ఎమ్మెల్యే ‘ఇది ప్రజా పాలన లాగా లేదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలన లాగా కనిపిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రమేయం లేకుండా తెలంగాణ వచ్చిందనే ప్రతీకారం ఉన్నట్టు ఉంది. అనేక మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి దాడులు గమనించాలి. ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశ్యం లేదు. ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం’అని క్రాంతి మండిపడ్డారు. -
తుది దశకు బీజేపీ అభ్యర్థుల జాబితా!
సాక్షి, ఢిల్లీ: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై మరోసారి ఫోకస్ పెట్టింది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, రాష్ట్ర బీజేపీ నేతలు హస్తినకు బయలుదేరారు. కాగా, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇక, లోక్‌సభకు అభ్యర్థుల ఎంపిక చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ సీట్లలో మూడింటిలో సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంతో పాటు (ఆదిలాబాద్ మినహా), చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నేడు దాదాపు ఒక్కొక్క అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. ఇక, ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక, బీజేపీ కీలక భేటీ నేపథ్యంలో రాష్ట్ర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ హస్తినకు పయనమయ్యారు. కాగా, అభ్యర్థుల ఎంపికపై వీరు అధిష్టానంలో తుది చర్చలు జరుపనున్నారు. మార్చి రెండో వారంలో అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడంటే.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వీరికి టికెట్లు ఖరారు కావొచ్చునని, కొన్ని స్థానాల్లో ఆయా నేతలు టికెట్ కోసం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్: కిషన్‌రెడ్డి కరీంనగర్: బండి సంజయ్ నిజామాబాద్: అర్వింద్ ధర్మపురి ఆదిలాబాద్: సోయంబాపూరావు లేదా బాపూరావు రాథోడ్, గుడెం నగేష్ మల్కాజిగిరి: ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, చాడ సురేష్ రెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, పొన్నా ల హరీష్‌రెడ్డి జహీరాబాద్: ఎం.జైపాల్‌రెడ్డి, ఆలె భాస్కర్, అశోక్ ముస్తాపురె / ఓ ప్రముఖ సినీ నిర్మాత చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి. జనార్దనరెడ్డి మహబూబ్‌నగర్: డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, శాంతకుమార్ భువనగిరి: బి.నర్సయ్యగౌడ్, జి. మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి మెదక్: ఎం.రఘునందన్‌రావు, జి. అంజిరెడ్డి వరంగల్: మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి నాగర్‌కర్నూల్: బంగారుశ్రుతి, కేఎస్ రత్నం హైదరాబాద్: టి.రాజాసింగ్, మాధవీలత, భగవంతరావు, పెద్దపల్లి: టి.కుమార్ లేదా ఎవరైనా కొత్త నేతకు అవకాశం నల్లగొండ: మన్నె రంజిత్‌యాదవ్ లేదా పార్టీలో చేరే మరో నాయకుడికి మహబుబాబాద్: హుస్సేన్‌నాయక్ / మరొకరికి ఖమ్మం: దేవకీ వాసుదేవరావు, వినోద్‌రావు, రంగా కిరణ్ -
కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు!
బెల్లంపల్లి: దేశంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ విజయసంకల్ప యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బజార్‌ఏరియా కాంటా చౌరస్తాలో శుక్ర వారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో నెలకొన్న సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. 75ఏళ్లపాటు పాలించి రూ.12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని స్వయంగా ఆ పార్టీ నాయకులే వద్దనుకుంటున్నారనీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాహుల్ విదేశాలకు వెళ్లిపోవడం తథ్యమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లకే పరిమితం అవుతుందని, బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు.. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పదేళ్లపాటు పాలన సాగించిన కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుని, అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందన్నారు. సభలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథ్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు అమురాజుల శ్రీదేవి, బోడిగ శోభ తదితరులు పాల్గొన్నారు. -
సగం సీట్లపై స్పష్టత వస్తుందా?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటీ తర్వాత రాష్ట్రంలో సగం లోక్‌సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నష్టం జరిగిందన్న వాదనల నేపథ్యంలో ఇప్పుడు 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు న్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడింటిలో సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంతో పాటు (ఆదిలాబాద్ మినహా), చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడంటే... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వీరికి టికెట్లు ఖరారు కావొచ్చునని, కొన్ని స్థానాల్లో ఆయా నేతలు టికెట్ కోసం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్: కిషన్‌రెడ్డి కరీంనగర్: బండి సంజయ్ నిజామాబాద్: అర్వింద్ ధర్మపురి ఆదిలాబాద్: సోయంబాపూరావు లేదా బాపూరావు రాథోడ్, గుడెం నగేష్ మల్కాజిగిరి: ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, చాడ సురేష్ రెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, పొన్నా ల హరీష్‌రెడ్డి జహీరాబాద్: ఎం.జైపాల్‌రెడ్డి, ఆలె భాస్కర్, అశోక్ ముస్తాపురె / ఓ ప్రముఖ సినీ నిర్మాత చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి. జనార్దనరెడ్డి మహబూబ్‌నగర్: డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, శాంతకుమార్ భువనగిరి: బి.నర్సయ్యగౌడ్, జి. మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి మెదక్: ఎం.రఘునందన్‌రావు, జి. అంజిరెడ్డి వరంగల్: మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి నాగర్‌కర్నూల్: బంగారుశ్రుతి, కేఎస్ రత్నం హైదరాబాద్: టి.రాజాసింగ్, మాధవీలత, భగవంతరావు, పెద్దపల్లి: టి.కుమార్ లేదా ఎవరైనా కొత్త నేతకు అవకాశం నల్లగొండ: మన్నె రంజిత్‌యాదవ్ లేదా పార్టీలో చేరే మరో నాయకుడికి మహబుబాబాద్: హుస్సేన్‌నాయక్ / మరొకరికి ఖమ్మం: దేవకీ వాసుదేవరావు, వినోద్‌రావు, రంగా కిరణ్ -
ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా
జడ్చర్ల టౌన్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నానని, నాయకులు, కార్యకర్తలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా తన గెలుపు కోసం రెండు నెలలు శ్రమించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన మేరకు తనకు లోక్‌సభ టికెట్ కేటాయింపులో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డుగా ఉంటుందని ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డికి తన రాజీనామాను సమర్పించానని, సమయం, సందర్భం రానందున బహిర్గత పరచలేదని తెలిపారు. శుక్రవారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చినపుడే సీఎం రేవంత్‌తో చర్చించానని, ఎంపీ టికెట్‌కు అడ్డు రాకుండా ఉంటేనే బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పానన్నారు. పదేళ్లుగా అనేక ఫైళ్లు ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పటంతో ఈ బాధ్యతలు స్వీకరించి అనేక శాఖల్లో ఫైళ్లలో కదలిక తీసుకువచ్చానన్నారు. తన రాజీనామాను ఆమోదించే వరకు ఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. అయితే తనకు టికెట్ రావడంలేదని ప్రచారం జరుగుతున్నందున కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలందరూ తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న మంద జగన్నాథం, సంపత్‌కుమార్‌లకు తాను వ్యతిరేకం కాదని, వారికి టికెట్ అడిగే హక్కు ఉందని అన్నారు. పార్టీ సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, టికెట్ ఇవ్వకూడదని ఏ ఒక్క కారణం చెప్పినా.. సర్వేలు అనుకూలంగా లేవని తేలినా తాను స్వీకరిస్తానని పేర్కొన్నారు. -
Updates: ఎమ్మెల్యే లాస్యకు నేతల నివాళులు
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి Updates.. ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య కొనసాగిన అంతిమయాత్ర హైదరాబాద్: లాస్య నందిత అంతిమ యాత్ర ప్రారంభం కాసేపట్లో మారేడుపల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళులు లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాస్య భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికాయానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హారీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు లాస్య కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ సోదరి, ఎమ్మెల్యే లాస్య మృతి ఆ కుటుంబానికి, కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. లాస్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చే ప్రయత్నం చేసినా ఆవేదనగా ఉంది. ఒకే ఏడాదిలో సాయన్నను, లాస్యను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడు ఆ కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కూడా సాయన్న కుటుంబానికి అండగా ఉంటుంది. ఆత్మీయ సోదరి, ఎమ్మెల్యే లాస్య నందిత గారి మృతి ఆ కుటుంబానికి, కంటోన్మెంట్ ప్రజలకు, బీఆరెస్ పార్టీకి తీరని లోటు. లాస్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చే ప్రయత్నం చేసిన. కానీ ఒకే ఏడాదిలో సాయన్నను, లాస్యను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడు ఆ… pic.twitter.com/bAP3A0udlz — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 23, 2024 ►లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులర్పించిన కేసీఆర్ ►కార్ఖానాలో లాస్య ఇంటికి చేరుకున్న కేసీఆర్ ►లాస్య ఇంటి వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. పూర్తిస్థాయి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తాం: పోలీసులు ►సంగారెడ్డి పటాన్చెరు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద లాస్య నందిత కారుకు ప్రమాదం ►ప్రమాదానికి గురైన కారును పరిశీలించిన ఏఎస్పీ సంజీవ రావు, ఆర్టీఏ రామారావు ►ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై ASP సంజీవ రావు ►ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగినట్టు సమాచారం వచ్చింది ►కారు శకలాలు 100 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి ►అక్కడిక్కడే ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు ►మరో వ్యక్తి ఆకాష్ మియపూర్ లో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ►ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తాం ఆ విషయంపై రాని స్పష్టత! ►నిన్న రాత్రి సదాశివపేట (మం) కొనపూర్ లోని మీస్కిన్ బాబా దర్గాకి వచ్చిన లాస్య నందిత కుటుంబ సభ్యులు ►కాసేపటికి దర్గాకి పీఏ ఆకాష్ తో కలిసి వచ్చిన ఎమ్మెల్యే లాస్య నందిత ►రాత్రి 12.30 గంటలకు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని చెబుతున్న దర్గా నిర్వాహకులు ►అర్ధరాత్రిరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ వెళ్లిన లాస్య నందిత కుటుంబం ►తిరిగి పటాన్ చెరు వైపు ఎందుకు వెళ్లారు? అన్నదానిపై నో క్లారిటీ తండ్రీ సమాధి పక్కనే.. ►ఇవాళే లాస్య నందిత అంత్యక్రియలు ►మారేడ్ పల్లి లోని స్మశాన వాటిక లో లాస్య నందిత అంత్యక్రియలు ►లాస్యనందిత తండ్రి సాయన్న అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ఆమె అంత్యక్రియలు చేయనున్న కుటుంబ సభ్యులు ►లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ►ఈరోజు సాయంత్రం లాస్య నందిత పార్ధీవ దేహానికి నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్ ►మేడారం జాతరకు వెళ్లి వచ్చిన తర్వాత లాస్య నందిత ఇంటికి వెళ్లనున్న సీఎం రేవంత్ ►కాసేపట్లో లాస్య నివాసానికి కేసీఆర్ ►లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్న కేసీఆర్ ►కార్ఖానాలోని తన నివాసానికి చేరుకున్న లాస్య నందిత పార్థివ దేహం ►ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు ►అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు ►లాస్యకు పోస్టుమార్టం పూర్తి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించిన గాంధీ వైద్యులు. ►లాస్య నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం ►గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ► గాంధీ ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం పూర్తయ్యాక నేరుగా కార్ఖానాలోని తన నివాసానికి లాస్య నందిత భౌతిక కాయం ►లాస్య నందిత అంత్యక్రియలు ముగిసే వరకు ఇక్కడే ఉండనున్న ఎమ్మెల్సీ కవిత ►లాస్య నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులకు పరామర్శ. ►గాంధీలో లాస్య మృతదేహానికి పోస్టుమార్గం, భారీగా తరలివచ్చిన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు. ► లాస్య నందిత నివాసానికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. ►పటాన్చెరు నుంచి గాంధీ ఆసుపత్రికి లాస్య మృతదేహం తరలింపు, ►గాంధీలో లాస్య మృతదేహానికి పోస్టుమార్టం, అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించనున్నారు. ►అమేధా ఆసుపత్రిలో లాస్య నందిత మృతదేహాం. ఆసుపత్రికి వెళ్తున్న కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు.. ►అమేధా ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు.. ►లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్‌రావు. ►పటాన్చెరు వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. ఇక, ఆమె మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ►ఈ క్రమంలో లాస్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. లాస్య మరణం బాధాకరమన్నారు. లాస్య కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం రేవంత్ సంతాపం.. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా… pic.twitter.com/Y44sF8Jvi9 — Revanth Reddy (@revanth_anumula) February 23, 2024 కేటీఆర్ సంతాపం.. ఇది దాదాపు వారం క్రితం లాస్యను పరామర్శించిన ఫోటోలు లాస్య ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన, షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నాను చాలా మంచి నేతగా ఉన్న యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం తీవ్ర నష్టం ఈ భయంకరమైన, క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు బలం చేకూర్చాలని నా హృదయపూర్వక ప్రార్థనలు This was about a week ago. Just now heard the absolutely tragic & shocking news that Lasya is no more !! Woke up to the devastating loss of the young legislator who was a very good leader in the making My heartfelt prayers for strength to her family and friends in this terrible… https://t.co/CqpfrxMweU — KTR (@KTRBRS) February 23, 2024 హరీష్‌రావు సంతాపం.. ►ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గవర్నర్ తమిళిసై సంతాపం.. లాస్య దుర్మరణం చెందడం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లాస్య నందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని తెలిపిన గవర్నర్ కిషన్‌రెడ్డి సంతాపం.. లాస్య అకాల మరణంపై కిషన్ రెడ్డి సంతాపం. చిన్న వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన లాస్య మరణం ఎంతో కలచివేసింది. గతంలో కార్పొరేటర్‌గా ఆ తర్వాత ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే లాస్య మంచి భవిష్యత్తున్న నాయకురాలు. ఆమె తండ్రి, నా మిత్రుడైన ఎమ్మెల్యే సాయన్న గతేడాదే అనారోగ్యంతో చనిపోయారు. ఏడాది తిరిగేలోపే లాస్య రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడవటం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ కవిత సంతాపం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సోదరి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాస్య నందిత అకాల మరణం అత్యంత బాధాకరం. లాస్య నందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సోదరి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాస్య నందిత అకాల మరణం అత్యంత బాధాకరం. లాస్య నందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని… — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 23, 2024 బీఆర్ఎస్ పార్టీ సంతాపం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా… pic.twitter.com/PZKVykFubA — BRS Party (@BRSparty) February 23, 2024 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం అత్యంత బాధాకరం.. ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్ ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదం.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.. గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం.. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతి ఎంతో బాధను కలిగించింది. ఆమె తండ్రి సాయన్న ఆశయాల సాధన కోసం ప్రజా సేవలోకి వచ్చిన ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజుల్లోనే స్వర్గస్థులవడం చాలా బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని ప్రార్ధిస్తున్నాను. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంతాపం.. ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను తలసాని సంతాపం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరం. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అయిపోతుందనుకోలేదు. లాస్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం ►సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ►ఇటీవల ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. నల్గొండలో భారాస బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ►దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. -
మోదీ పాలనలోనే దేశాభివృద్ధి
షాద్‌నగర్, కొందుర్గు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చేరుకుంది. ఈ సందర్భంగా లాల్‌పహాడ్, కొందుర్గు, షాద్‌నగర్‌లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని కోరారు. ప్రజా సంక్షేమం, దేశ భద్ర త, అవినీతి రహిత సమాజం ఆయనతోనే సాధ్యమన్నారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ప్రశ్నించాలని సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీ నేతలు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలవుతున్నా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దారి మళ్లించి, అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. రామరాజ్యం కావాలంటే.. ‘బీజేపీకి మోదీ ఉన్నాడు.. ఆయన వెనక శ్రీరాముడు ఉన్నాడు.. కాంగ్రెస్‌కు రాహుల్, కేసీఆర్, ఒవైసీలు ఉన్నారు. దేశంలో రామరాజ్యం కావాలంటే తిరిగి ఎవరు అధికారంలోకి రావాలో ప్రజలే తేల్చుకోవాలి’అని బండి సంజయ్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మళ్లీ మోదీ ప్రధాని అయితేనే రైతులకు సబ్సిడీలు, పేదలకు ఉచిత బియ్యం వస్తాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారని అన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయని, అలా కావాలంటే బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుకోవాలని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు అవకాశాలున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టులతో వెళ్లాలని భావిస్తోందన్నారు. ఒకవేళ పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ప్రారంభమైంది. ఆ పార్టీ సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తమ్మినేని మాట్లాడుతూ.. పొత్తు ఉంటుందా? లేదా? అన్నది కాంగ్రెస్ పారీ్టనే తేల్చాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, కానీ ఒకసారి ఆరు నెలలు, మరోసారి సంవత్సరంలో భర్తీ చేస్తామని అంటున్నారని, ఈ రెండు మాటల్లో మర్మమేంటని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో రామమందిరం ప్రారంభోత్సవ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అక్షింతలు ఓట్లుగా మారతాయా? బీజేపీకి ఓట్లేస్తారా? అనేది చూడాలన్నారు. బీజేపీపై రేవంత్‌రెడ్డి పోరాడాలి: బీవీ రాఘవులు కర్ణాటక ప్రభుత్వ తరహాలో బీజేపీకి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి ఇక్కడ పోరాడాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కోరారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు వచ్చాయని, అవి సమన్లా లేక గాలమా అనేది కొద్దిరోజుల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు. ’’కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లేస్తే మూసీనదిలో వేసినట్టేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు కానీ నిజానికి కిషన్రెడ్డీ నువ్వే మూసీలో పడిపోతావు జాగ్రత్త’’అని రాఘవులు ఎద్దేవాచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రాములు, జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్, టి.సాగర్, మల్లు లక్ష్మి, పి.ప్రభాకర్ పాల్గొన్నారు. -
తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గుచూపింది. బీఆర్ఎస్తో పొత్తు ఉందంటూ జరుగుతున్న విస్తృత ప్రచారానికి తెరదించేందుకు సిద్ధమైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ సొంతంగానే పోటీచేస్తామని.. బీఆర్ఎస్తో పొత్తుగానీ, ఎలాంటి అవగాహనగానీ ఉండదని ప్రజలకు చాటాలని తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌లకు పలు సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ విజయ సంకల్పయాత్రలను ప్రారంభించి.. అందరికన్నా ముందుగా ఎన్నికల సమరం ప్రారంభించిందని వివరిస్తున్నాయి. వరుసగా పొత్తు వార్తల నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అందుకు బీజేపీ ఢిల్లీనేతలు కూడా సుముఖంగా ఉన్నారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు, కొందరు రాష్ట్ర మంత్రులు కూడా బీఆర్ఎస్–బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని, ఆ రెండు పార్టీల మధ్య రహస్య బంధం కొనసాగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ఒకరిద్దరు బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీతో పొత్తు ఉండవచ్చంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్–బీజేపీల పొత్తు ప్రచారం ముమ్మరమైంది. అయోమయానికి తెరదించుతూ.. బీఆర్ఎస్తో పొత్తు ప్రచారం బీజేపీ శ్రేణుల్లో అయోమయం, గందరగోళానికి దారితీసింది. ఇదిలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలపైనా ప్రభావం పడవచ్చని భావించిన బీజేపీ అప్రమత్తమైంది. బీజేపీ రాష్ట్ర కీలక నేతలు ఎలాంటి పొత్తు ఉండదని పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆ పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ ఎలాంటి పొత్తు, సీట్ల సర్దుబాటు వంటివి ఉండబోవని స్పష్టం చేసింది. వచ్చే నెల రెండోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చన్న అంచనా నేపథ్యంలో పార్టీ శ్రేణులు, ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా చూడాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులకు ఫోన్‌చేసి స్పష్టమైన సూచనలు చేసినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పొత్తు కోసం బీఆర్ఎస్ చేసిన ప్రతిపాదనలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల దృష్టికి తీసుకెళ్లారని.. వారు నిర్ద్వందంగా తిరస్కరించారని ఢిల్లీ వేదికగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. మోదీ ఫ్యాక్టర్.. పెరిగిన మద్దతుతో.. రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరిగిందని, దీనికి ప్రధాని మోదీ చరిష్మా జతకలిస్తే.. ఇక్కడ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామని ఆ పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు చెప్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సొంతంగా 4 సీట్లు గెలిచామని గుర్తు చేస్తున్నారు. ఈసారి బీజేపీ ఏడెనిమిది సీట్లు గెలుస్తుందని సర్వేల్లో తేలిందని, పార్టీ నాయకులు కొంచెం కష్టపడితే మరో రెండు సీట్లనూ సాధించవచ్చని జాతీయ నాయకత్వం స్పష్టం చేసిందని అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర ప్రధాన పార్టీల కంటే ముందే.. 17 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించి విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టినట్టు వివరిస్తున్నారు. త్వరలోనే అభ్యర్థుల ఎంపిక ఈనెల 24న ఢిల్లీలో జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కనీసం సగం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడం, జనసేనతో పొత్తు కారణంగా పార్టీ బలంగా ఉన్న కొన్నిసీట్లను కోల్పోవాల్సి రావడంతో ఇబ్బంది ఎదురైందని అంటున్నాయి. అందువల్ల ఈసారి తొందరగానే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించేందుకు జాతీయ నాయకత్వం సిద్ధమైందని చెప్తున్నాయి. కాగా.. ఈనెల 24న లేదా 25న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు రావాల్సి ఉందని.. కానీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ నేపథ్యంలో పర్యటన వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడిందని పార్టీ వర్గాల సమాచారం. -
TS: మంత్రి పదవి కోసం అన్నదమ్ముల మధ్య పోటీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రి వర్గంలో మన ఎమ్మెల్యేల్లో ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ వీడడం లేదు. రాష్ట్రంలో తొలి మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి కేబినెట్లో బెర్త్ దక్కుతుందనే ఆసక్తి అధికార పార్టీతో పాటు ప్రజల్లోనూ ఉంది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. పార్టీలో సీనియర్ నాయకుడు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు మొదటి కూర్పులోనే కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం జరిగినా అవకాశం రాలేదు. ఇక గడ్డం సోదరులైన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. అన్నదమ్ముల్లోనే పోటీ మాజీ మంత్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇద్దరూ అన్నదమ్ములు. వీరిరువురూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. 2004నుంచి 2009 మధ్య చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశానని, తనకే మళ్లీ అవకాశం ఇవ్వాలని వినోద్ కోరుతున్నారు. ఇందుకోసం రెండునెలల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసి విన్నవించారు. ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డిని తరచూ కలుస్తున్నారు. గడ్డం వివేక్ కూడా మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరూ పదవిపై పోటీ పడుతూ ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. వంశీ ఎంపీ టికెట్‌తో లింకు? లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగాలని వివేక్ తనయుడు వంశీకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు, ఒకరికి ఎంపీ టికెట్, మళ్లీ అదే కుటుంబం నుంచి మంత్రి పదవి కూడా ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే కోణంలో పరిశీలన చేస్తున్నట్లు నాయకులు చెప్పుకొంటున్నారు. ఇక వంశీకి లోక్‌సభ టికెట్ కావాలని అడుగుతున్న క్ర మంలో టికెట్ ఇస్తే, మంత్రి పదవి వదులుకుంటా రా? లేక టికెట్‌తో పాటు కేబినెట్లో చోటు కోసం పట్టుబడుతారా? అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలయ్యే దాకా ఈ సమస్య తేల్చ కుడా, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసే అవకాశం ఉందని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఉమ్మ డి జిల్లాలో పాలన పరంగా ఇబ్బంది లేకుండా, స్థా నికంగా మంత్రి ఎవరూ లేకపోవడంతో ఆ స్థానంలో మంత్రి సీతక్కను ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆమెతోనే పాలన కొనసాగిస్తారా? లేక ఇక్క డి ఎమ్మెల్యేల్లో ఎవరికై నా అవకాశం కల్పిస్తారా?.. అనే విషయం తేలేవరకూ వేచిచూడాల్సిందే. ‘పీఎస్సార్’కు పెద్దల హామీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీని బలోపేతం చేశార నే మంచి పేరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఉంది. కష్టకాలంలో పార్టీలో కేడర్‌ను కాపాడినట్లు చెప్పుకొంటారు. ఆ సమయంలో గడ్డం సోదరులు ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. రెండేళ్ల క్రితం బీఎస్పీ నుంచి వినోద్, ఇటీవల అ సెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ కాంగ్రెస్‌లో చేర డం తెలిసిందే. వీళ్లిద్దరి కంటే పార్టీలో సీనియర్‌గా ఉండి, పార్టీ కోసం కష్టపడ్డారని, పీఎస్సార్‌కే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘దళిత గిరిజన దండోరా’ బహిరంగ సభ సక్సెస్ చేసి పార్టీలో ఉత్తేజం నింపారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ను సక్సెస్ చేశారు. మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ వేదికపైనే పీఎస్సార్ వచ్చే ప్రభుత్వంలో మంచిహోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. తర్వాత పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఈ క్రమంలో ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
రేవంత్ సర్కార్‌పై హరీష్‌రావు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు పాలన నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తీర్చకుంటే ఉద్యమం చేస్తామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇక, తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ, ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వం తక్షణం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలు చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది.… — Harish Rao Thanneeru (@BRSHarish) February 22, 2024 -
కాంగ్రెస్‌లో రేవంత్ కొత్త పోకడలు!
ఆశావహులు దరఖాస్తులు సమర్పించాలి. ఆ అప్లికేషన్లను ఎన్నికల కమిటీలు పరిశీలించాలి. కొన్ని పేర్లను ఫైనలైజ్ చేయాలి. వాటిని అధిష్టానానికి మరోసారి జల్లెడ పట్టాలి. వడపోసిన జాబితాను అధిష్టానం ఓకే చేయాలి. ఆ తర్వాతే పార్టీ పెద్దలు అభ్యర్థుల పేర్లను స్వయంగా ప్రకటించాలి. ఇది ఏ ఎన్నికల సమయంలో అయినా.. అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అవలంభించే విధానం. కానీ, తెలంగాణలో ఆ సిస్టమ్‌కు బ్రేక్ పడింది!. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా? అధిష్టానాన్ని కూడా లెక్క చేయకుండా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొత్త పోకడలకు పోతున్నారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా.. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును సీఎం హోదాలో రేవంత్ రెడ్డి(పీసీసీ చీఫ్ కూడా) ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమేయం లేకుండానే రేవంత్ అభ్యర్థుల జాబితాపై ప్రకటన చేయడం ఏంటని? అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాక మునుపే తెలంగాణ కాంగ్రెస్ తరఫున తొలి అభ్యర్థి ప్రకటన వెలువడింది. బుధవారం కొడంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్.. కోస్గి సభలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఒక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 50వేలకు తగ్గకుండా వంశీకి మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారాయన. సాధారణంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో చర్చించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. కానీ.. ఇలాగేనా చేసేది? .. ఓ బహిరంగసభలో అభ్యర్థిని రేవంత్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో అధిష్టానం అంటే లెక్కే లేనట్లు వ్యవహరిస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణ.. వాటి పరిశీలన.. కమిటీల చర్చోపచర్చలు.. ఇన్ని జరగాల్సి ఉండగా.. అవేం పట్టన్నట్లు ఒక అభ్యర్థిని ప్రకటించడంతో రేవంత్ తీరుపై సీనియర్లు గుర్రుమంటున్నారు. మొన్నీమధ్యే.. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనను చివరి రోజు వరకు కాంగ్రెస్ నాన్చింది. ఇందులోనూ రేవంత్ హస్తం ఉందనే అభిప్రాయానికి ఇప్పుడు సీనియర్లు వచ్చారు. ఎంపీ అభ్యర్థులను కూడా జిల్లా వారీగా రేవంత్‌రెడ్డి ఇలాగే ప్రకటిస్తారా? అంటూ గుసగుసలాడుకుంటుకున్నారు. అయితే.. ఈ విషయంలో రేవంత్ తొందర పడలేదని.. హైకమాండ్ డైరెక్షన్లోనే అంతా నడుస్తోందని ఢిల్లీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రేవంత్ ప్రకటన వెనుక ఆయన! మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కోసం కాంగ్రెస్‌లో సీనియర్లు అర్జీలు పెట్టుకున్నారు. అందులో మన్నె జీవన్‌రెడ్డి, కొత్త కోట సీతాదయాకర్ లాంటివాళ్లు ఉన్నారు. అయినా గానీ.. వంశీచంద్‌రెడ్డికి ఎలా సీటు ప్రకటించారనే డౌట్లు లేవనెత్తారు కొందరు. అయితే రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయడం వెనుక.. ఢిల్లీ నుంచి మద్ధతు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన చేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్‌కు హైకమాండ్ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం.. రాహుల్ గాంధీ అనే చర్చా పార్టీలో జరుగుతోంది. పార్టీలో యువరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చాలాకాలంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా బల్మూరీ వెంకట్‌కు, రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్‌కు అవకాశం దక్కినట్లు స్పష్టం అవుతోంది. అలాగే.. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నేతగా ఉన్న టైంలో రాహుల్‌తో వంశీకి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. వీటన్నింటికి తోడు.. జోడో యాత్ర సమయంలోనూ రాహుల్ వెంటే వంశీ నడిచారు. ఈ పరిణామాలన్నీ వంశీకి అనుకూలించాయనే చెప్పొచ్చు. ఇక అధిష్టానం సూచనలతోనే రాబోయే రోజుల్లోనూ మరికొందరి పేర్లను ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. -
ఆ రెండింటి డీఎన్ఏ ఒక్కటే
నారాయణపేట: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని, అందుకు కుటుంబ రాజకీయాలే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నారాయణపేటలో విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కుమ్మక్కై బీజేపీపై దుష్ప్రచారం చేశాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సోషల్ మీడియాలో అదే ప్రచారం సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరగటంతో పాటు 8 స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. ఈ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం లేకపోతే.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తప్పుచేశారంటూ కేసీఆర్ కుటుంబం ఇంకా అహంకారపు మాటలు మాట్లాడుతోందని విమర్శించారు. మజ్లిస్ సహకారంతో హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారని కిషన్‌రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్య రామమందిర నిర్మాణం చేపడితే, మజ్లిస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. రామమందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పంపించినా రాలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. మరోసారి మోదీనే ప్రధాని.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ధర్మబద్ధంగా పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైందన్నారు. ఆరు గ్యారంటీలు ఆరు గారెలుగా మారిపోయాయన్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ రకమైన ఎజెండా లేదని.. ఆ పార్టీ ఒక్క సీటు గెలిచినా ప్రజలకు మేలు జరగదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
మోదీ రాజ్యం కావాలా.. రజాకార్ల రాజ్యం రావాలా
కైలాస్‌నగర్/నిర్మల్: ఎంతో మంది కరసేవకుల బలిదానాల, త్యాగాల స్ఫూర్తిగా రామాలయా న్ని నిర్మించిన అవతార పురుషు డు ప్రధాని నరేంద్ర మోదీ అని, అలాంటి మోదీ రాజ్యం కావాలా.. రాక్షసుల్లా వస్తున్న కాంగ్రె స్, బీఆర్ఎస్ రజాకార్ల పాలన కావాలా అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకో వాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆ పార్టీ ఆధ్వ ర్యంలో చేపట్టిన విజయసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో బండి మాట్లాడారు. అయోధ్యలో బాబ్రీ మసీద్ ఉండాలనే వారిని బట్టలూడదీసి కొట్టాలని, రాముడి పుట్టుకను ప్రశ్నిస్తున్న పార్టీలను రాజకీయ సమాధి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజ ల పక్షాన ఉద్యమించి తాము పోరాడితే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. జాతీయ స్థాయి నాయకుడిగా దేశంలో చక్రం తిప్పుతానని భావించిన కేసీఆర్, తెలంగాణ ప్రజల తీర్పుతో బొక్కబోర్లాపడి ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుందని, గల్లీలో నే ఓడిపోయిన ఆ పారీ్టతో తమకు పొత్తు ఎలా ఉం టుందని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో హిందువులు సంఘటితమై 17 ఎంపీ సీట్లను గెలిపిస్తే కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి రాష్ట్రా న్ని అభివృద్ధి చేస్తామని బండి హామీ ఇచ్చారు. రాంజీగోండు స్ఫూర్తి కేంద్రానికి భూమిపూజ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌కు గడువు సమీపిస్తున్నందున ఆలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్‌కూ పడుతుందని బండి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపల్లి మార్గంలో ఉన్న అమరుల స్థూపానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌లతో కలిసి ఆయన నివాళులర్పించారు. మహేశ్వర్‌రెడ్డితో కలిసి రాంజీగోండు స్ఫూర్తికేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఒక వర్గం ఓట్ల కోసం ఆదివాసీల చరిత్రను తెరమరుగు చేసే కుట్ర చేస్తారా? అని ప్రశ్నించారు. ఎక్కడైతే వెయ్యిఉరుల మర్రి ఉండేదో అక్కడే స్ఫూర్తి కేంద్రాన్ని ఏడాదిలోగా పూర్తిచేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ నేతల గడువులో 70 రోజులు ముగిశాయన్నారు. ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందని, ఆలోపే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
యుద్ధం అయిపోలేదు: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్: ‘‘రాష్ట్ర నలుమూలలా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా మన యుద్ధం అయిపోలేదు. ఇది విరామం మాత్రమే. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కార్యకర్తలు విశ్రాంతి తీసుకుందామనుకోవద్దు. 17 ఎంపీ సీట్లలో 14 సీట్లు గెలిచినప్పుడే పార్లమెంట్లో పట్టుసాధిస్తాం. అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ యుద్ధం గెలిచినట్లు. అప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌కు గొప్పదనం. కొడంగల్‌కు గౌరవం దక్కుతాయి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కొడంగల్ నియోజకవర్గ పరిధిలో రూ.4,369.14 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు కోస్గి పట్టణం వేదికగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళా సంఘాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం కోస్గి పట్టణ శివార్లలోని కొడంగల్ రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలసి కుట్ర చేశాయి. బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఓడినా ఫర్వాలేదని చూశాయి. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్‌ను గెలిపించడంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఒకరు పొత్తు అంటారు.. ఇంకొకరు చెప్పుతో కొడతా అంటారు. వాళ్ల మాటలు నమ్మొద్దు. వాళ్లు కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని కుట్రపన్నుతున్నారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి గతంలో కరీంనగర్లో ఓడిపోతాననే కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాకు వలస వచ్చారు. పాలమూరు నుంచి ఎంపీగా గెలిపించినందుకే తెలంగాణ సాధించి సీఎం అయ్యే అవకాశం దక్కిందని కేసీఆర్ అన్నారు. మరి పదేళ్లు సీఎంగా ఉండి పాలమూరుకు ఏం చేశారు? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు తీసుకున్నారే తప్ప ఏం ఒరగబెట్టారు? ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాకే కేసీఆర్ పాలమూరులో ఓట్లు అడగాలి. తెలంగాణను దోచుకున్నారు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు చిన్నారెడ్డి ప్రారంభించిన ఉద్యమంలో కేసీఆర్ దూరి తెలంగాణను దోచుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఛీకొట్టి ఇంట్లో కూర్చోబెడితే.. అల్లుడు నల్లగొండ నుంచి, కొడుకు మహబూబ్‌నగర్ నుంచి పాదయాత్ర చేపడతారట. మళ్లీ పాలమూరు జిల్లాకు ఎందుకు వస్తారు? నెట్టెŠంపాడు, భీమా, కోయిల్‌సాగర్, దేవాదుల, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, ప్రాణహిత పూర్తిచేయలేదేం? బీఆర్ఎస్–బీజేపీలది చీకటి ఒప్పందం బీజేపీ, బీఆర్ఎస్లది చీకటి ఒప్పందం. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు గడ్డ వేదికగా ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోదీ చెప్పారు. ఇప్పుడు కిషన్‌రెడ్డి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డిలను అడుగుతున్నా.. జాతీయ హోదా ఎందుకివ్వలేదు? వికారాబాద్–కృష్ణా రైల్వేలైన్‌ను కాంగ్రెస్ హయాంలో మంజూరు చేస్తే.. గత పదేళ్లలో తట్టెడు మట్టి తీయలేదు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి, మరో ముగ్గురు బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా.. రాష్ట్రానికి నలుగురు కలిసి నాలుగు రూపాయలైనా తెచ్చారా?’’ అని రేవంత్ మండిపడ్డారు. కొడంగల్ ప్రజలు ఆశీర్వదించడంతోనే తాను సీఎంగా నిలబడి మాట్లాడుతున్నానని చెప్పారు. సమావేశంలో చివరిలో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డిని ఆశీర్వదించాలని.. కొడంగల్ నుంచి 50వేలకుపైగా మెజార్టీ అందించాలని రేవంత్ పిలుపునిచ్చారు. దీంతో పరీక్షంగా మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి వంశీ పేరును ప్రకటించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ సీఎం నీళ్లు తీసుకెళ్తుంటే సహకరించారు.. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర సీఎంలకు తెలంగాణ అంటే భయం ఉండేది. నిధులు, జల దోపిడీకి పాల్పడాలంటే.. తెలంగాణ నాయకులు ప్రశి్నస్తారనే భయం ఉండేది. కానీ తెలంగాణ సీఎంగా కేసీఆర్ బరితెగించారు. ఏపీ సీఎం పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిప్టు, మల్యాల ద్వారా రోజుకు 12 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించుకుపోతుంటే సహకరించారు. పైగా ఏపీ సీఎంను ప్రగతిభవన్‌కు పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు తినిపించారు. 203 జీఓ ద్వారా రాయలసీమను రత్నాలసీమ చేస్తాననీ చెప్పారు. కానీ పార్లమెంట్‌కు పంపించిన పాలమూరు ప్రజల కోసం ఇక్కడి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి? వారంలో మరో రెండు గ్యారంటీలు అమల్లోకి.. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంపును అమల్లోకి తెచ్చాం. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ కలసి రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1,200కు పెంచారు. మేం వారం రోజుల్లో రూ.500కే సిలిండర్ అందజేయనున్నాం. అలాగే 200 యూనిట్లలోపు వినియోగించే పేదలకు ఉచిత విద్యుత్‌ను అమల్లోకి తెస్తాం. పెండింగ్‌లో ఉన్న రైతుబంధు డబ్బులను వచ్చే నెల 15లోగా వేస్తాం. త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. రెండేళ్లలో నారాయణపేట లిఫ్టు పూర్తి: ఉత్తమ్ బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎంతో గోస పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. 1.30 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూ.2,945 కోట్లతో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. రెండేళ్లలోనే దీనిని పూర్తిచేస్తామన్నారు. ► పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు, నల్లగొండ అత్యంత వివక్షకు గురయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ► కేసీఆర్ కుటుంబపాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఈ సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నేత మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, వాకిటి శ్రీహరి, మనోహర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్
సాక్షి, మహబూబ్‌నగర్: పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కోస్గి సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి తొలి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కోస్గి సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వలస వచ్చిన కేసీఆర్‌ను గెలిపిస్తే ఇక్కడి ప్రజలను మోసగించారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ జిల్లాలో ఓట్లు అడగాలన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయమే తెలంగాణకు ఎక్కువ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వని దద్దమ్మ కేసీఆర్. ...అభివృద్ధి ముసుగులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు. సిగ్గులేకుండా యాత్రలు చేస్తేమని బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. బీజేపీ,బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రధాని మోదీ జాతీయహోదా ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో జిల్లా బీజేపీ నేతలు డీకే అరుణ,జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ జిల్లాలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. ...వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కొడంగల్‌లో 50 వేల మెజార్టీ ఇస్తే మరింత అభివృద్ధి చేస్తా. తెలంగాణలో 14 లోక్ సభ సీట్లు గెలిస్తేనే మన యుద్దం ముగిసినట్టు. కార్యకర్తలు ఆ దిశగా పనిచేయాలి. రాబోయే వారం రోజుల్లో 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. వచ్చే నెల 15 వ తేదీలోపు రైతులందరికి రైతుబంద్ అందిస్తాం. రైతులను రుణవిముక్తి చేసేందుకు త్వరలో 2 లక్షల రుణమాపీ చేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చల్లా వంశీచంద్ రెడ్డి 2014లో బీఆర్ఎస్ పార్టీ హవాని తట్టుకుని మరీ కల్వకుర్తి నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 మహబూబ్ నగర్ ఎంపీగా కూడా పోటీ చేసి వంశీచంద్ రెడ్డి ఓటమిపాలయ్యారు. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రకటనతో వంశీచంద్‌రెడ్డి మరోసారి మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నారు. -
బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు: ఎంపీ కే. లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయేలో బీఆర్ఎస్ చేరుతామంటే చేర్చుకోమని బీజేపీ రాజ్యసభ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయవద్దు: కిషన్‌రెడ్డి
సాక్షి, మహబూబునగర్: కుటుంబాల కోసం దోచుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయవద్దని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయన దేవరకద్ర కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ‘ఏప్రిల్ నెలలలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ముందు ప్రపంచ దేశాల అధ్యక్షులు చేతులు కట్టుకొని నిలబడే స్థాయికి వచ్చాము. తొమ్మిదిన్నర సంవత్సరాలలో సెలవు తీసుకోకుండా పని చేసిన వ్యక్తి మోదీ. మరీ కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు రాలేదు. దేశం అంటే అంకితభావంతో పనిచేసే వ్యక్తి మోదీ. 5 వందల సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి గుడి కూల్చి మసీదు కట్టాడు. కానీ నేడు టెంటులో ఉన్న రాముడికి భవ్య మైన మందిరం నిర్మించాడు మోదీ సంకల్పం అదే. ... దేశంలో ఎక్కడ కూడా ఈపాలనలో అల్లర్లు జరిగిన చరిత్ర లేదు. సర్జికల్ స్ట్రైక్ చేయించి పాకిస్థాన్ భూభాగంలో ఉన్న తీవ్రవాదులను చంపిన చరిత్ర మోడీది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టిన ఘనత మోదీది. ధర్మం వైపు ఉన్న మోదీ కావాలా అధర్మం వైపు ఉన్న కాంగ్రెస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఏ రంగంలో అయిన మోదీ చరిష్మా కనిపిస్తుంది. ... దేవరకద్రలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి హామీ ఇస్తున్నా. దేశం లో ప్రజలందరూ మోదీ వైపు ఉన్నారు. తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను కమలంకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యం. రాష్ట్రంలో రాహుల్ టాక్స్ వేస్తున్నారు. ఇక్కడ దోపిడీ చేసి ఎన్నికలలో ఖర్చు పెట్టాలని దోపిడీ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది వారు బీజేపీ వైపు నిలబెడుతారనే నమ్మకం ఉంది’ అని కిషన్‌రెడ్డి అన్నారు. -
మల్కాజిగిరి ఛాన్స్ నాకివ్వండి: ఈటల రాజేందర్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తమకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తమ సొంత కాళ్లపై నిలబడి పోటీ చేసి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీచేస్తానని మరోసారి ఈటల పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడిగడ్డపై సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. అధికారం వచ్చాక మాట మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి, తప్పుదోవ పట్టించి హామీలు ప్రకటించిందని మండిపడ్డారు. ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హామీలపై ప్రజల భ్రమలు తొలగుతున్నాయని అన్నారు ఈటల. ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య, అక్యూపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెరగలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. చదవండి: TS: ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని.. రూ. 6300కోట్ల రూపాయాలతో మూత పడిన ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. నిజమాబాద్‌లో పసుపు బోర్డు పెట్టి నేనున్నానని భరోసా ఇచ్చారని ప్రస్తావించారు. దక్షిణాన రూ. 26వేల కోట్లతో రిజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేశారని తెలిపారు. ‘ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కేసీఆర్ సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశారు. కేసీఆర్ లక్ష రూపాయాల రుణమాఫీ ఐదేళ్ళ కాలంలో పూర్తి స్థాయిలో జరగలేదు. రెండు లక్షల రుణ మాఫీ ఒకటే దఫా చేయాలంటే సాధ్యం కానీ పరిస్థితి. గతంలో కేసీఆర్ జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన హామీలను అరచేతిలో వైకుంఠం చూపెడతున్నారు. 400లకు పైగా ఉన్న హామీలను మరోసారి కాంగ్రెస్ చదువుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఇండియా కూటమి అతుకుల బొంతగా మారింది. దేశం ఒక్కప్పుడు బాంబుల మోతలు, మత కలహాలు ఉండేది. బీజేపీ పాలనలో దేశమంతా ప్రశాంతంగా ఉంది’ అని పేర్కొన్నారు. -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మళ్లీ పోరు బాట పట్టనుంది. తర్వలో నీటి పోరు యాత్ర చేసేందుకు పార్టీ యోచిస్తోంది. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు దానిని ఖండిస్తున్నారు. కానీ ఎన్నికల వేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పొత్తుపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి