నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం | YS Jagan attends a marriage function-in-chandragiri | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

Nov 2 2016 1:14 PM | Updated on Apr 4 2018 9:31 PM

నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం - Sakshi

నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్రెడ్డి చంద్రగిరిలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు.

హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్ మోహన్రెడ్డి బుధవారం చంద్రగిరిలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన చంద్రగిరి చేరుకున్నారు. స్థానిక వైఎస్‌ఎంఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని.. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. 
 
కాగా చాలా రోజుల తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్న అధినేత వైఎస్‌ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రేణిగుంటలో అభిమానులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి మీదున్న దామినేడు నుంచి చంద్రగిరి వరకూ రోడ్డుకు ఒకవైపున పార్టీ జెండాలు పట్టుకుని 7 వేల మంది అభిమానులు ఆయన కోసం వేచి ఉన్నారు. హైవే మీద 20 కిలోమీటర్ల పొడవున భారీ జెండాలను ఏర్పాటు చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement