
పవన్ ఇంటి ముందు యువతి బైఠాయింపు
సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఓ యువతి ఆయన ఇంటి ముందు బైఠాయించింది.
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఓ యువతి ఆయన ఇంటి ముందు బైఠాయించింది. నగరంలోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటి ముందు గత నాలుగు రోజులుగా తాడ్చాడుతున్న జ్యోతి బుధవారం రాత్రి పవన్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది.
పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని చెప్పినా వినకుండా అక్కడే కూర్చుంది. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అదించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను వారిస్తుండగా.. పోలీసుల తీరుకు నిరసనగా.. ఆమె నడి రోడ్డుపై కూర్చొని ఆందోళన చేసింది. తాను ఎలాంటి న్యూసెన్స్ చేయకపోయినా.. పోలీసులు తన పై దాడి చేశారని.. అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. అంటూ ఆరోపిస్తున్న జ్యోతిని సముదాయించి స్టేషన్‌కు తరలించారు.