దొంగల బీభత‍్సం... మహిళ దారుణ హత‍్య | women murdered house robbery in krishna district | Sakshi
Sakshi News home page

దొంగల బీభత‍్సం... మహిళ దారుణ హత‍్య

Mar 1 2017 9:44 PM | Updated on Aug 30 2018 5:27 PM

కృష్ణాజిల్లా కంకిపాడు మసీదు సెంటర్‌లో బుధవారం వేకువజామున దారుణం జరిగింది. కర్రి శ్రీదేవి అనే మహిళ ఒంటరిగా ఇంట్లో వుండటంతో దొంగలు చోరీకి ప్రయత్నించారు.

కంకిపాడు: కృష్ణాజిల్లా కంకిపాడు మసీదు సెంటర్‌లో బుధవారం వేకువజామున దారుణం జరిగింది. కర్రి శ్రీదేవి అనే మహిళ ఒంటరిగా ఇంట్లో వుండటంతో దొంగలు చోరీకి ప్రయత్నించారు. అడ్డు వచ్చిన శ్రీదేవిని గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న 70 కాసుల బంగారం, 4 లక్షల నగదు ఆపహరించారు. మృతురాలి కుటుంబసభ్యులు తెల్లవారు జామున వచ్చి చూస్తే శ్రీదేవి మృతదేహం కనిపించింది. వెంటనే వారు  పోలీసులకు సమాచారం అందించారు.

రాజమండ్రికి చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి దంపతులు పదేళ్ళ కిందట కంకిపాడుకు వచ్చి స్థిరపడ్డారు. ఫైనాన్స్ వ్యాపారం చేసే శ్రీనివాసరెడ్డి తన కుమారుడు సతీష్ రెడ్డితో కలిసి తరచూ క్యాంప్‌లకు వెళ్లుతుంటాడు. ఇది గమనించిన నిందితులు శ్రీదేవి ఒంటరిగా వున్న సమయం చూసి ఆమెపై దాడిచేసి, ఇంట్లోని సొత్తును చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటుచేశారు. ఈ హత‍్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement