పాలమూరు జిల్లాలో దారుణం | wife kills her husband in mahabubnagar fire by pouring kerosene | Sakshi
Sakshi News home page

పాలమూరు జిల్లాలో దారుణం

Sep 7 2016 3:38 PM | Updated on Oct 8 2018 5:07 PM

భర్తపై భార్య కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

మహబూబ్నగర్ : పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్తపై భార్య కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన కోడూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్త రాము మృతిచెందాడు. 
 
గంగమ్మ బుధవారం ఉదయం భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో రాము అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాముకు గంగమ్మతో కొంతకాలంగా కుటుంబ కలహాలు నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement