‘గుట్కా’ కేసులో ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్ల అరెస్టు | two soldiers are arrested in gutka case | Sakshi
Sakshi News home page

‘గుట్కా’ కేసులో ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్ల అరెస్టు

Dec 4 2014 10:36 PM | Updated on Sep 26 2018 6:49 PM

గుట్కా కేసులో ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్పీఎఫ్)సిబ్బందిని అరెస్టు చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

సాక్షి, ముంబై: గుట్కా కేసులో ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్పీఎఫ్)సిబ్బందిని అరెస్టు చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... లోకమాన్య తిలక్ టర్మినస్ స్టేషన్‌లో ఒకటవ ఫ్లాట్‌ఫాం సమీపంలో, అక్టోబర్ 15 వ తేదీన రూ. 3 లక్షల విలువ చేసే గుట్కాను సీజ్ చేశారు.  ఆ సందర్భంగా జీఆర్పీ సిబ్బంది ఆర్‌ఆర్ జైస్వాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా, అతడిని విచారించగా తనకు గుట్కాను ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బందే అందజేశారని చెప్పాడు. అతడిచ్చిన సమాచారం మేరకు ఆర్పీఎఫ్‌కు చెందిన కానిస్టేబుళ్లు విశాల్ పాటిల్, విజయ్ అమాడేలను అరెస్టు చేసినట్లు జీఆర్పీ అధికారి తెలిపారు. అలాగే వారిద్దరినీ సస్పెండ్ చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement