 
															సరసమాడుతున్న పాములు
కెలమంగలం: డెంకణీకోట పట్టణంలో ఆదివారం సరసమాడుతున్న పాములు స్థానికుల కంటపడ్డాయి. డెంకణీకోట పట్టణ పంచాయతీ టీచర్‌కాలనీ పరిధిలో ఆదివారం రెండు పాములు సరసమాడుతున్న దృశ్యం చూసి స్థానికులు గుమిగూడారు. కొంత మంది సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీశారు.

శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకాలోని కురువళ్లి గ్రామంలో భారీ తాచుపాము కనిపించింది. శనివారం రాత్రి గ్రామంలోని శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి సుమారు 12 అడుగుల భారీ తాచుపాము చొరబడడంతో శ్రీనివాస్ వెంటనే స్నేక్ కిరణ్‌కు సమాచారం అందించారు. ఆయన అక్కడకి చేరుకుని పామును పట్టుకొని సమీప అడవుల్లో వదిలిపెట్టారు. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
