కదులుతున్న రైలు నుంచి పడి యువకుడు మృతి చెందాడు.
పరుగులు తీస్తున్న రైలు బండిలో నుంచి జారిపడి యువకుడు మృతిచెందిన సంఘటన రాజమహేంద్రవరంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న దాడి శివ అనే యువకుడు ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.