కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మంగళవారమిక్కడ పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మంగళవారమిక్కడ పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. తమిళనాడు, కేరళ గవర్నర్లు కొణిజేటి రోశయ్య, పి సదాశివం ఆయనతో భేటీ అయ్యారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా రాజ్నాథ్ను కలిశారు. వీరు వేర్వేరుగా కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విషయాల గురించి రాజ్నాథ్తో చర్చించినట్టు సమాచారం.