25 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్ | suleiman arrested in chennai airport | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్

Feb 28 2016 8:11 AM | Updated on Aug 20 2018 4:44 PM

25 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్ - Sakshi

25 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్

25 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న నేరస్తుడిని చెన్నై విమానాశ్రయంలో శనివారం పోలీసులు అరెస్టు చేశారు.

తిరువొత్తియూరు : 25 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న నేరస్తుడిని చెన్నై విమానాశ్రయంలో శనివారం పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా అదిరామాపట్టణంకు చెందిన సులైమాన్ (56). ఇరువర్గాల మధ్య ఘర్షణ, దాడి చేసుకున్న సంఘటనకు సంబంధించి ఇతనిని పలు విభాగాల కింద అదిరామం పట్టినం పోలీసులు 1991వ సంవత్సరంలో కేసు నమోదు చేశారు. ఇతని కోసం గాలింపు చేపట్టిన సమయంలో ఇతను అజ్ఞాతంలోకి వెళ్లాడు.

విదేశాలకు తప్పించుకుని వెళ్లకుండా అడ్డుకునేందుకు అన్ని విమానాశ్రయాలకు ఇతని ఫొటో ఇచ్చి గాలిస్తున్న నిందితుడిగా తెలిపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 4.30 గంటలకు చెన్నై నుంచి షార్జాకు వెళ్లు గతృ ఎయిర్‌వేస్ విమానం సిద్ధంగా ఉంది. ఈ విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన వారిని తనిఖీ చేస్తుండగా సులేమాన్ వద్ద పాస్‌పోర్టు, వీసాను తనిఖీ చేయగా అతను 25 సంవత్సరాలుగా పోలీసులు వెతుకుతున్న వ్యక్తి అని తెలిసింది.

దీంతో అతన్ని అరెస్టు చేసి దీని గురించి తంజావూరు పోలీసులకు సమాచారం అందించారు. తంజావూరు పోలీసులు చెన్నై వచ్చి సులేమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement