పార్కు ప్రారంభం | Start Park | Sakshi
Sakshi News home page

పార్కు ప్రారంభం

Oct 20 2014 2:34 AM | Updated on Oct 1 2018 6:38 PM

పార్కు ప్రారంభం - Sakshi

పార్కు ప్రారంభం

మారుతీమందిర వార్డులోని కెనరాబ్యాంక్ కాలనీలో ఏర్పాటుచేసిన పార్కును ఆదివారం రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ ప్రారంభించారు.

బెంగళూరు : మారుతీమందిర వార్డులోని కెనరాబ్యాంక్ కాలనీలో ఏర్పాటుచేసిన పార్కును ఆదివారం రాష్ట్ర రవాణ శాఖ  మంత్రి రామలింగారెడ్డి, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ ప్రారంభించారు. ఈ పార్కును రెండన్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో నిర్మించారు. ఇందులో యువకులు, వయోవృద్ధులు వ్యాహ్యాళికి వెళ్లడానికి అన్ని సదుపాయాలు కల్పించారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆటపరికరాలు ఉన్నాయి.

మహాత్మాగాంధీతో పాటు ఇతర నాయకులు విగ్రహాలతోపాటు కెనరాబ్యాంక్ వ్యవస్థాపకులు అమ్మెంబల్ సుబ్బారావ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కును వినియోగించుకుని ఆహ్లాదం పొందాలని పేర్కొన్నారు. అంతకు ముందు నగరమేయర్ శాంతకుమారి వినాయక లేఔట్‌లో ఉన్న పార్కులో పొడిచెత్తను వేరుచేసే యంత్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ వీ.సోమణ్ణ, ఎమ్మెల్యే ప్రియాకృష్ణ, డెప్యూటీమేయర్ కే.రంగణ్ణ, స్థానిక కార్పొరేటర్లు వాగీశ్‌ప్రసాద్, మోహన్‌కుమార్, ఉమేష్ శెట్టి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement