బస్సు ఢీకొని సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం | Software engineer killed in bus accident | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం

Aug 3 2014 9:04 AM | Updated on Sep 2 2017 11:19 AM

బీఎంటీసీ బస్సు ఢీకొని మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన ఇక్కడి వైట్ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బెంగళూరు: బీఎంటీసీ బస్సు ఢీకొని మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన ఇక్కడి వైట్ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక సర్జాపుర మెయిన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజినీరు నివేదిత (28) నివాసముంటుంది. ఆమె బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది.

మార్గంలో వైట్ఫీల్డ్ సమీపంలోని ఐటీపీఎస్ మెయిన్ రోడ్డులోక వస్తుండగా వెనుక నుంచి బీఎంటీసీ బస్సు డ్రైవర్ స్కూటర్ను ఓవర్టేక్ చేయడానికి యత్నించారు. ఆ క్రమంలో బస్సు... స్కూటర్ను ఢీకొట్టింది. దాంతో నివేదిత కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి బస్సు వెళ్లి పోయింది. దీంతో నివేదిత అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement