
కర్ణాటక , దొడ్డబళ్లాపురం : ఇంట్లోకి వచ్చి న పాము ఒకటి ఇంటి ఆవరణలో విడిచిన షూలో దాక్కుని ఇంట్లోవారిని బెంబేలెత్తించిన సంఘటన నెలంగలలో చోటుచేసుకుంది. తాలూకాలోని నారాయణప్పనపాళ్య గ్రామం శివారులో మూర్తి అనే వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించి గృహప్రవేశం చేశాడు. మంగళవారం ఉదయం ఇల్లు క్లీన్ చేసే క్రమంలో షూలో పాము చేరుకున్న సంఘటన గుర్తించారు. దీంతో భయపడిపోయిన మూర్తి స్నేక్ లోకేశ్‌కు సమాచారం ఇచ్చాడు. తక్షణం ఇంటికి వచ్చిన స్నేక్ లోకేశ్ పామును పట్టుకున్నాడు. పట్టుబడ్డ పాము సుమారు 5 అడుగుల పొడవు ఉంది. పాత వస్తువులు బయట పెట్టరాదని స్నేక్ లోకేశ్ సూచించారు.