ముంబై: శివసేనలోని అసంతృప్తి నాయకులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే షిర్డీ ఎంపీ భావుసాహెబ్ వాక్‌చౌరే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు.
సాక్షి , ముంబై: శివసేనలోని అసంతృప్తి నాయకులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే షిర్డీ ఎంపీ భావుసాహెబ్ వాక్‌చౌరే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు.
అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన కాంగ్రెస్‌లో చేరారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మరోవైపు తాజాగా శనివారం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌తో పర్భణీ ఎంపీ గణేష్ దుధ్గావ్కర్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కూడా ఎన్సీపీలో చేరనున్నట్టు ప్రచారం సాగుతోంది.