
సీఎంగారు ఢిల్లీకి రండి
ఇటీవల వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకమాండ్ నుంచి పిలుపు అందింది.
సీఎం సిద్దుకు అధిష్టానం పిలుపు
బెంగళూరు : ఇటీవల వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. ఈ నేపథ్యంలో ఈనెల 23న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నింటిపై ఇప్పటికే సమాచారాన్ని క్రోడీకరించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయాలపై సీఎం సిద్ధరామయ్యను వివరణ కోరనుంది.
ఇదే సందర్భంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన సైతం సిద్ధరామయ్యలో నెలకొంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో తాను చేపట్టిన పర్యటన వివరాలను సైతం సిద్ధరామయ్య పార్టీ హైకమాండ్‌కు తెలియజేయనున్నారు. అంతేకాక ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు సమాచారం.