చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బ | setback to chandrababu govt on swiss challenge | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బ

Sep 12 2016 11:03 AM | Updated on Aug 31 2018 8:31 PM

చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బ - Sakshi

చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రపంచస్థాయి నగర నిర్మాణం కోసమే స్విస్ ఛాలెంజ్ పద్ధతి పాటిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య కన్స్ట్రక్షన్స్, చెన్నైకు చెందిన ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్విస్‌ చాలెంజ్‌ విధానంలో లొసుగులున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం..
‘చాలెంజ్’.. ఇది దోపిడే
హైకోర్టు ఆగ్రహంతో... దిగొచ్చిన సర్కారు
 

Advertisement
 
Advertisement
Advertisement