అత్యాచారం కేసుల్లో ‘ఫాస్ట్’గా తీర్పు | Rape cases, the 'fast' as the judgment | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసుల్లో ‘ఫాస్ట్’గా తీర్పు

Nov 11 2014 1:32 AM | Updated on Sep 2 2017 4:12 PM

అత్యాచారం కేసుల్లో ‘ఫాస్ట్’గా తీర్పు

అత్యాచారం కేసుల్లో ‘ఫాస్ట్’గా తీర్పు

మహిళలు, బాలికలపై అత్యాచారాలు, భౌతిక దాడులు తదితర కేసుల్లో త్వరితగతిన తీర్పులు వెలువరించి బాధ్యులను

బెంగళూరులో త్వరలో రెండు ప్రత్యేక కోర్టులు
రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్


బెంగళూరు : మహిళలు, బాలికలపై అత్యాచారాలు, భౌతిక దాడులు తదితర కేసుల్లో త్వరితగతిన తీర్పులు వెలువరించి బాధ్యులను శిక్షించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తం గా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా తక్షణమే బెంగళూరులో ఇలాంటి కోర్టులను రెండింటిని ఏర్పాటు చేస్తామన్నారు. విధానసౌధలో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వ సూచనలపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే పాఠశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఐదో తరగతి వరకూ బోధన, బోధనేతర సిబ్బంది నియామకంలో మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తామన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement