నోట్ల మార్పిడి చేస్తున్న నలుగురు అరెస్టు | police nabs currency exchange gang | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి చేస్తున్న నలుగురు అరెస్టు

Nov 28 2016 1:59 PM | Updated on Sep 22 2018 7:51 PM

రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోరుట్ల: రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోట్ల మార్పిడి అనుమానంతో నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్, పెరికిట్‌లలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన వ్యాపారి చింతా సంతోష్‌ పేరు చెప్పారు. దీంతో ఆయన ఇంట్లో సోదా చేయగా రూ. 26 లక్షల విలువ గల పాత నోట్లు, రూ. 76 వేల విలువ గల కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement