కారు-లారీ ఢీకొన్న సంఘటనలో శివాని(25) అనే యువతి మృతిచెందింది.
చేవెళ్ల రూరల్(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రూరల్ మండలం దామరగిద్ద గ్రామ శివారులో ఆదివారం ఉదయం కారు-లారీ ఢీకొన్న సంఘటనలో శివాని(25) అనే యువతి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు బీటెక్ విద్యార్థులు వికారాబాద్ నుంచి కారులో హైదరాబాద్ వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.
కారు అతివేగంగా వస్తూ అదుపు తప్పి లారీని ఢీకొందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.