పులిలో నందిత | Nandita joins the cast of Puli | Sakshi
Sakshi News home page

పులిలో నందిత

Apr 14 2015 2:08 AM | Updated on Apr 3 2019 9:12 PM

పులిలో నందిత - Sakshi

పులిలో నందిత

పులి చిత్రంలో నటి నందిత భాగం పంచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న

పులి చిత్రంలో నటి నందిత భాగం పంచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం పులి. సోషియో ఫాంటసీ కథాం శంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం లో ముఖ్యపాత్రను అతిలోకసుందరి శ్రీదేవి పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో అదనంగా నటి నందిత చేరనున్నా రు. అట్టకత్తి చిత్రంలో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఎదుర్‌నీచ్చల్ తదితర చిత్రాల్లో నటించి హోమ్లీ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఇప్పటి వరకు శివకార్తికేయన్, దినేష్ లాంటి యువ నటుల సరసన నటించారు.
 
  తాజాగా ఇళయదళపతితో నటించే జాక్‌పాట్‌ను కొట్టేశారు. పులి చిత్రంలో ఈమెది చాలా కీలకపాత్ర అట. త్వరలోనే పులి చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నట్లు నందిత తెలిపారు. అయితే ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్న విషయం గురించి చెప్పడానికి ఇంకా సమయం ఉంది అన్నారు. కన్నడ నటుడు సుదీప్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనది ప్రతి నాయకుడి పాత్ర అని సమాచారం. విజయ్ పి ఆర్ ఓ పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తలకోనలో జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement